అంతర్జాతీయం

నులివెచ్చని చప్పుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 14: అవే కేరింతలు. ఆశ్చర్యపోయే కౌగిలింతలు. మాస్కో మైదానాల్లో స్పర్శకొచ్చిన అత్యద్భుత గుండె చప్పుళ్లివి. రష్యా గడ్డమీద నా దేశం జట్టుకు చోటుదక్కలేదన్న చిన్న అసంతృప్తి. దాన్ని మాయం చేస్తూ మాస్కో గుండెల్లో నా దేశానికి దక్కుతోన్న నులివెచ్చని స్పర్శ. ఇప్పటిదే కాకపోవచ్చు. మహాద్భుత సోవియట్ శకం నుంచీ ఆ స్పర్శ ఉండొచ్చు. కానీ, ఇప్పటికీ రష్యన్ల గుండెల్లో ‘జయహో’ అంటూ వినిపిస్తోన్న నినాదాల మధ్య సాగిన నెల రోజుల ప్రయాణం ఎప్పటికీ మధుర జ్ఞాపకమే. ప్రపంచకప్ మహా సంరంభం ముగింపునకు వచ్చింది. తిరుగుముఖం పట్టేందుకు సిద్ధమవుతోన్న ఇండియన్ల గుండెలనుంచి వినిపిస్తోన్న మధురానుభూతులివి. భారత జెండానో, దాన్ని ధరించిన పౌరుడినో చూడగానే విప్పారే రష్యా ముఖాలు. బాగా పరిచయమున్న రాజ్‌కఫూర్‌నో, మిథున్ చక్రవర్తినో చూస్తున్నంత ఆనందంతో పలికరింపులు. ‘్భరత్‌ను ప్రేమిస్తా. అక్కడి ఆహారాన్ని ఇష్టపడతా. ఇండియన్స్ అంటే చచ్చేంత ఇష్టం. వాళ్ల సినిమాలిష్టం. వాళ్లు ధరించే రంగులిష్టం. నా దగ్గర అమ్మే వస్తువుల్లో వాళ్లకెప్పుడూ డిస్కౌంట్ ఉంటుంది’. ఈ మాటలు ఎవరివో కాదు, మాస్కో వీధుల్లో మిట్రియోష్కా బొమ్మలమ్మేవాడివి. రష్యా కల్చర్‌ని ప్రతిబింబించే వాటిలో ఎక్కువ కొనేది ఇండియనే్ల. ‘ఒక తియ్యని అనుబంధమేదో ఇండియన్, రష్యన్ల మధ్య పెనవేసుకుని ఉంటుంది. నులివెచ్చని వాళ్ల చూపుల్లోనే ఆ విషయం మనకు అర్థమవుతుంది’ అంటున్నాడు ఓ టూరిస్ట్ గైడ్. ఫిఫా ప్రపంచకప్‌తో గత నెల రోజులుగా ఇండియన్ టూరిస్టులతో బిజీగా గడిపాడు అతను. అతని అంచనాల ప్రకారం రష్యాకు సహాజంగా వచ్చే ఇండియన్ టూరిస్టుల సంఖ్య, ఫిఫా ప్రపంచకప్ కారణంగా 30 శాతం పెరిగింది. ట్రావెల్ ఏజెన్సీల సమాచారం ప్రకారం ఈనెలలో ఇండియన్ టూరిస్టుల సంఖ్య 400 శాతం పెరిగినట్టు స్పుత్నిక్ న్యూస్ ఏజెన్సీ కథనాలు అందించింది. నిజానికి ప్రపంచకప్‌లో భారత జట్టు లేకపోయినా, భారత్ నుంచి రష్యాకు వెళ్లిన అభిమానుల సంఖ్యను ఇది తేటతెల్లం చేస్తోంది. ‘రష్యా ఎప్పటికీ గొప్ప ఆహ్వానిత ప్రదేశమే. ఫిఫా కోసం వచ్చిన పాశ్చాత్యులూ రష్యన్ల వెచ్చని కౌగిలింతల్లో ఆనందం వ్యక్తం చేశారు. కాకపోతే, ఫిఫా ప్రపంచకప్ కోసమే కాకపోయినా, రష్యాకు వచ్చే అవకాశముంటే భారతీయులు ఎగిరి గంతేస్తారు. రష్యన్ల మనసెరిగి మసలుకుంటారు. రష్యా టూర్‌లో భారతీయుల ఆనందమే వేరు’ అన్నది ఓ ఇండియన్ టూరిస్ట్ వ్యాఖ్య. ‘రష్యాకు వచ్చే టాప్ టూరిస్ట్ దేశాల జాబితాలో ఇండియా లేకపోవచ్చు. కానీ, రష్యన్ల గుండెల్లో ఎప్పటికీ భారత్‌కు ప్రథమ స్థానమే ఉంటుంది. అది బాలీవుడ్ సినిమా వల్ల కావొచ్చు, భారత్‌కు సోవియట్ ఎరాతోవున్న రాజకీయ సంబంధం కావొచ్చు. కారణం ఏదైనా ప్రత్యేకత మాత్రం ప్రత్యేకమే’ అన్నది ఓ టూర్ ఆపరేటర్ మాట. అందుకే ఫాన్స్-బెల్జియం మధ్య సెయింట్ పీటర్స్‌బర్గ్ మైదానంలో జరిగిన తొలి సెమీఫైనల్ స్టాండ్స్‌లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమితాబ్ చిందులేశాడు. మాస్కో లుజ్నికి స్టేడియంలో క్రొయేషియా -ఇంగ్లాండ్ మధ్య జరిగిన మలి సెమీ ఫైనల్‌కు హాజరైన 78వేల అభిమానుల మధ్య ఫర్దీన్ ఖాన్ కనిపించాడు. ‘ఎంత చెప్పుకున్నా చెప్పుకోవాల్సింది చాలానే ఉంటుంది. ఆ నులివెచ్చని చప్పుళ్లను మనసు చెవులతో వినాలే తప్ప, మాటల్లో మాత్రం కాదు. సాకర్ సంరంభం ముగిసింది. భారత్‌కు బయలుదేరుతున్నా’ అంటూ లుజ్నికి స్టేడియంలో ఓ భారత అభిమాని తను గుండెచప్పుడు వినిపించాడు.