అంతర్జాతీయం

ఎవరి పంతం వారిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, జూలై 14: ఇటు ఇటలీ, అటు మాల్టా దేశాలు మొండి వైఖరిని అనుసరిస్తున్న నేపథ్యంలో, లిబియా నుంచి ఒక భారీ పడవలో బయలుదేరిన శరణార్థులు సముద్ర జలాల్లోనే చిక్కుకుపోయారు. ఈ రెండు దేశాలు తీసుకోబోయే నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారు. సుమారు 450 మంది శరణార్థులతో కూడిన పడవను మాల్టా సముద్ర జలాల్లో ఇటలీ కోస్ట్‌గార్డ్ సిబ్బంది గుర్తించారు. ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించి, ఆ పడవను నిలిపేశారు. అనంతరం వారిని రెండు పడవల్లోకి మార్చారు. అయితే, తమ భూభాగంలోకి ఈ శరణార్థులు అడుగు పెట్టడానికి వీల్లేదని ఇటలీ స్పష్టం చేస్తున్నది. మాల్టా సరిహద్దులోనే పట్టుబడ్డారు కాబట్టి, వారికి ఆశ్రయం ఇచ్చే బాధ్యత ఆ దేశానిదేనని వాదిస్తున్నది. కానీ, మాల్టా ఈ వాదనను అంగీకరించడం లేదు.
ప్రస్తుతం వారు ఇటలీ సముద్ర జలాల్లోకి ప్రవేశించి, అక్కడే ఎదురుచూస్తున్నారని, కాబట్టి వారి బాధ్యత తమకు ఏమాత్రం లేదని తేల్చిచెప్తున్నది. ప్రధాని గుసెప్ కొనే్టతో చర్చించిన తర్వాతే శరణార్థులపై తమ వైఖరిని స్పష్టం చేశామని, ఇందులో ఎలాంటి మార్పు లేదని ఓడ రేవుల విభాగాన్ని కూడా తన వద్దనే ఉంచుకున్న ఇటలీ హోం శాఖ మంత్రి మాటియో సాల్వినీ అంటున్నాడు. శరణార్థులను మాల్టాలోగానీ, లిబియాలోగానీ దించేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని, అంతేగానీ, తమ దేశంలోకి అనుమతించేది లేదని వ్యాఖ్యానించాడు. మొత్తం మీద ఇటలీ, మాల్టా వివాదం ఒక కొలిక్కి రాకపోవడంతో, శరణార్థులుగా ఎక్కడైనా స్థిరపడవచ్చన్న ఆలోచనతో, ప్రాణాలకు తెగించి బయలుదేరిన లిబియన్లు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ వివాదం ఎప్పటికి తేలుతుందో, వారికి ఎప్పుడు, ఎక్కడ ఆశ్రయం లభిస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.