అంతర్జాతీయం

భారత్‌కన్నా బలమైన శక్తిగా పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 22: తన పార్టీకి అధికారం ఇస్తే పాకిస్తాన్‌ను భారతదేశం కన్నా బలమైన శక్తిగా రూపొందిస్తానని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ ఛీప్ షాబాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు. అలా చేయలేకపోతే తన పేరును మార్చుకుంటానని ఆయన స్పష్టం చేశారని ఓ పాకిస్తాన్ మీడియా వార్త పేర్కొంది. ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్న షాబాజ్ షరీఫ్ పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గ్ధో జిల్లాలో శనివారం (నిన్న) జరిగిన ఓ భారీ ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు వాఘా సరిహద్దుల్లోకి వచ్చి పాకిస్తానీయులను వారి గురువులుగా పిలిచే రోజు వస్తుందని షాబాజ్‌షరీఫ్ పేర్కొన్నట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ అనే వార్తాసంస్థ పేర్కొంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన షాబాజ్‌షరీఫ్ పాకిస్తాన్‌ను మలేషియా, టర్కీలతో సమానంగా అభివృద్ధి చేస్తానని, ఇందుకోసం తాను మలేషియా ప్రధాని మహతీర్ మహమ్మద్, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌ను కలిసి చర్చలు జరుపుతానని, పాకిస్తాన్‌ను తిరిగి ఓ మహోన్నత దేశంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన విషయాలను అధ్యయనం చేస్తానని అన్నారు.