అంతర్జాతీయం

ఇమ్రాన్‌కే మా మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 22: మరో రెండు రోజుల్లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్‌కు మాజీ క్రికెటర్లు, సినీ నటుల మద్దతు లభించింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్‌సాఫ్ (పీటీఐ) పార్టీని స్ధాపించిన విషయం విదితమే. తాను అధికారంలోకి వస్తే వంద రోజుల్లో పాకిస్తాన్‌లో సంస్కరణలు ప్రవేశపెడుతానని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, పేదలకు ఇండ్లను నిర్మించి ఇస్తామని, విద్యుత్ కోతలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. 1992లో ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలోనే పాకిస్తాన్ ప్రపంచ కప్‌ను సాధించిందని మాజీ క్రికెటర్ వాసిమ్ ఆక్రం ట్వీట్ చేశారు.
ప్రపంచంలోనే పాకిస్తాన్ గొప్ప ప్రజాస్వామ్య దేశంగా అవతరిస్తుందని ఆయన ఆకాంక్షించారు. మీ విధేయతను ఎవరు శంకించలేరని, యువతకు ఆదర్శమని మరో క్రికెటర్ యూనిస్ అన్నారు. ఇటీవల మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒక అవినీతి కేసులో జైలుపాలయ్యారు. దీంతో ఇమ్రాన్‌పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెరిగాయి. పాకిస్తాన్‌లో శక్తివంతమైన మిలిటరీ అధికారులు కూడా ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. కాని తమకు ప్రజల మద్దతు తప్ప ఎవరి అండదండలు లేవని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు.