అంతర్జాతీయం

సిక్కుమతంపై అమెరికా విద్యార్థులకు పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్కు, జూలై 22: అమెరికన్లకు సిక్కుమతం అంటే ఏమిటో తెలియదు. అందుకే తమ దేశ విద్యార్థులకు ప్రపంచంలోని మతాల వివరాలు తెలియచేసేందుకు పాఠ్యాంశాల్లో సిక్కుమతం అంశాన్ని చేర్చింది. సిక్కు సంప్రదాయాలు, మత పద్ధతులను విద్యార్థులు తెలుసుకోవాలని అమెరికా విద్యా శాఖ నిర్ణయించింది. దీని వల్ల విద్యార్థులకు ప్రపంచమంటే ఏమిటో తెలుస్తుందని విద్యా శాఖ నివేదికలో పేర్కొంది. అమెరికాలో సిక్కు మతానికి చెందిన ఒక సంస్థ, న్యూయార్కు విద్యా శాఖ ఉమ్మడిగా పై నిర్ణయం తీసుకున్నాయి. సిక్కుమతానికి చెందిన సలహాదారు ప్రీత్‌పాల్ సింగ్ మాట్లాడుతూ, 70శాతం మంది అమెరికా విద్యార్థులకు సిక్కుమతం, చరిత్ర తెలియదన్నారు. తరగతిలో చదువుతున్న సిక్కు మతస్తులగురించి కూడా తెలియదన్నారు. మేము భారత్ నుంచి వచ్చామన్న విషయం కూడా అమెరికన్ విద్యార్థులకు తెలియదన్నారు. ఇకపై ఐదు, ఆరవ తరగతుల్లో సిక్కుమతంపై పాఠ్యాంశాలను చేర్చినట్లు చెప్పారు. సిక్కులకు పవిత్రమైన వైశాఖి ఉత్సవం గురించి కూడా ప్రజలకు వివరించామన్నారు. అమెరికాలో న్యూజెర్సీ, ఇండియానా, డెలవారే, ఒరిగాన్ రాష్ట్రాలు ఏప్రిల్ నెలను సిక్కుల పవిత్ర మాసంగా ప్రకటించాయి. సిక్కుల పౌరహక్కుల గురించి కూడా ప్రచారం చేశారు.