అంతర్జాతీయం

తెరపైకి మళ్లీ కాశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 26: భారత్, పాకిస్తాన్ దేశాలు కాశ్మీర్ అంశంపై సామరస్యంగా కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం లభిస్తుందని, రెండు దేశాల మధ్య ప్రధాన అడ్డంకి కాశ్మీర్ సమస్య అని ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న పీటీఐ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తన్ తెహరిక్ -ఇ-ఇన్సాఫ్ ఆధిక్యత లభించింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పాక్ గత పాలకుల మాదిరిగానే కాశ్మీర్‌ను సమస్యగా చిత్రీకరించే ప్ర యత్నించారు. ఆయన ప్రసంగంలో కాశ్మీర్‌పై ఎక్కువ సేపు మాట్లాడారు. భారత్ పొరుగుదేశమని, మంచి సంబంధాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఇరుదేశాలు పరస్పరం నిందించుకోవడం మానివేస్తే ఉద్రిక్తతలు చల్లారుతాయన్నా రు. ‘ భారత్ ఒక అడుగు వేస్తే, నేను రెండు అడుగులు వేస్తాను’ అంటూ స్నేహ హస్తం అందిస్తూనే రెండు దేశాల మధ్య కాశ్మీర్ ప్రధానమైన సమస్య అంటూ పాత పాటనే పాడారు. భారత్‌లో చాలా మంది ప్రజలకు తాను, తన క్రికెట్ జీవితం తెలుసని ఆయన చెప్పారు. దక్షిణాసియాలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తానన్నారు. ఇరుదేశాలు కూర్చుని కాశ్మీర్ అంశంపై అరమరికలు లేకుండా చర్చించుకోవాలన్నారు. భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనే తాపత్రయం ఉన్నానన్నారు. కాశ్మీర్ సమస్య భారత ఉపఖండానికి ఒక సవాలుగా తయారైందన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు బాగుంటే అందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. భారత్
మీడియా తనను బాలీవుడ్ విలన్‌గా చిత్రీకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. అమెరికాతో సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామన్నారు. ఇరుదేశాలకు ఉపయోగపడే అంశాలపై దృష్టిని సారిస్తామన్నారు. ఇరాన్, సౌదీ అరేబియాతో మంచి సంబంధాలు ఉండాలని పాకిస్తాన్ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. చైనా పాకిస్తాన్ కారిడార్ వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని, చైనాతో సంబంధాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఆఫ్గనిస్తాన్ ప్రజలు ఉగ్రవాదం వల్ల తీవ్రంగా నష్టపోయారని, పేదరికంతో కొట్టుమిట్టాడుతోందన్నారు. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ రెండు దేశాలు శాంతిని కోరుకుంటున్నాయన్నారు. ఐరోపా యూనియన్ తరహాలో ఆఫ్గనిస్తాన్‌తో సరిహద్దులతో సంబంధంలేకుండా వాణిజ్య బంధాలు బలపడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 22 ఏళ్ల రాజకీయ పోరాటం ద్వారా అల్లా దయ వల్ల పార్టీకి ప్రజల మద్దతు లభించిందన్నారు. పాకిస్తాన్‌లో వ్యవస్థలను బలోపేతం చేస్తానన్నారు. జవాబుదారీతనం పెంచుతానన్నారు. విఐపి సంస్కృతికి మంగళం పాడుతామన్నారు. ప్రధానమంత్రి ఇంటిని విద్యా సంస్థ కేంద్రంగా మారుస్తామన్నారు. సుపరిపాలన అందిస్తానని, ఆర్థికంగా బలమైన దేశంగా తీర్చిదిద్దుతానన్నారు.
ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన పీటీఐ
పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. కాని ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత లభించలేదు. మొత్తం 272 సీట్లలో 172 సీట్లు లభిస్తే సంపూర్ణ మెజార్టీ లభించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం పీటీఐ పార్టీ 86 సీట్లలోనెగ్గి, మరో 34 సీట్లలో మెజార్టీతో దూసుకుపోతోంది. జైలుపాలైన నవాజ్‌పార్టీ ఆధ్వర్యంలోని పీఎంఎల్ ఎన్ 43 సీట్లలో గెలిచింది. మరో 18 సీట్లలో ఆధిక్యత లభించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 18 సీట్లలో నెగ్గింది. మరో 22 సీట్లలో మెజార్టీలో ఉంది. కాగా రిగ్గింగ్ వల్లనే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. కాగా అవామీ నేషనల్ పార్టీ, ఎంక్యుఎం తదితర పార్టీలు కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించాయి. ఎన్నికల కమిషన్ క్రెడిబిలిటీ దెబ్బతిందని పీపీపీ అధినేత బిలావల్ భుట్టో విమర్శించారు. కాని ఈ అభియోగాలను పాకిస్తాన్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించామని పేర్కొంది. ప్రావిన్స్‌లకు జరిగిన ఎన్నికల్లో పంజాబ్‌లో ఇమ్రాన్ పార్టీకి 120 సీట్లు, పీఎంఎల్ ఎన్ పార్టీకగి 119 సీట్లు లభించాయి. సింధ్‌లో భుట్టో పార్టీకి ఆధిక్యత లభించింది. చాలా చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.