అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికే ఇస్లామిక్ సైనిక కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్, ఏప్రిల్ 4: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సౌదీ అరేబియా తీసుకున్న చర్యలను, ఉగ్రవాద వ్యతిరేక పోరులో 34 ముస్లిం దేశాలను ఒక్కతాటిపైకి తెచ్చి శక్తివంతమైన ఇస్లామిక్ సైనిక కూటమిని ఏర్పాటు చేసిన తీరును సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్‌అజీజ్ అల్ సౌద్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలన్న నిబద్ధతకు ఈ ఇద్దరు నేతలు కట్టుబడి ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో సౌదీ అరేబియా తీసుకున్న చర్యలను ఆదివారం ఇక్కడి అల్ యమామహ్ ప్యాలెస్‌లో జరిగిన చర్చల సందర్భంగా ఆ దేశ రాజు అల్ సౌద్ భారత ప్రధానికి వివరించారు. ఉగ్రవాదానికి ముఖ్యంగా ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి ఇస్లాం మతానికి ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన సౌదీ అరేబియా 34 ముస్లిం దేశాలతో కలిసి ఒక కూటమిని ఇటీవల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గల్ఫ్ ప్రాంతంలో ఐఎస్‌ఐఎస్ విస్తరణను నియంత్రించడానికి అరబ్ దేశాలు ఏమీ చేయడం లేదనే విమర్శలు తలెత్తిన నేపథ్యంలో ఈ కూటమి ఏర్పడింది. భారత్, పాకిస్తాన్‌కు ప్రధాన మిత్ర దేశమైన సౌదీ అరేబియా ఉగ్రవాద వౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చాయి.
దేశ విధానంలో భాగంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించుకోవడాన్ని ఇరు దేశాలు ఖండించాయి. మనీలాండరింగ్, ఉగ్రవాదులకు అందే ఆర్థిక సాయానికి సంబంధించిన నిఘా సమాచారాన్ని పంచుకోవడానికి సంబంధించిన ఒక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఉగ్రవాదంపై పోరుపై విస్తృతంగా చర్చించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు ప్రత్యేకంగా చమురు రంగంలో వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకునే అంశంపై ఈ ఇద్దరు నేతలు చర్చించారు.