అంతర్జాతీయం

వీఐపీ సంస్కృతికి ఇక స్వస్తి: ఇమ్రాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 26: దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్ అనేక సంస్కరణలు చేపట్టనున్నారు. అట్టహాసాలు, ఆడంబరాలకు తమ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమన్న ఇమ్రాన్‌‘ప్రధాని కార్యాలయాన్ని విద్యా సంస్థల ప్రాంగణంగా తీర్చిదిద్దుతాం’ అని గురువారం ప్రకటించారు. ధనికులు ధనికులుగానే పేదలు ఎప్పుడూ పేదలుగా ఉండిపోవాలన్న విధానానికి తాము స్వస్తిచెబుతామన్నారు. సమూలమైన మార్పులు తీసుకురానున్నట్టు ఖాన్ తెలిపారు.‘పీఎం గృహాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. దాన్నొక విద్యా కేంద్రంగా మారుస్తాం. ముఖ్యంగా వీఐపీ సంస్కృతికి స్వస్తిచెబుతాం’అని కాబోయే ప్రధాని ప్రకటించారు.‘అవినీతిని నిర్మూలించి సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతోనే 22 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చా. ఇప్పుడు తన కలలను నిజం చేసుకునే అవకాశం వచ్చింది’అని 65 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ‘మా నాయకుడు ఖ్వయద్ ఈ ఆజామ్ మహ్మద్ ఆలీ జిన్నా కలలను నిజం చేస్తాం’అని ఆయన తెలిపారు. తన వెనక బలమైన మిలటరీ ఉందన్న పీటీఐ చీఫ్ నవ పాకిస్తాన్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు.