అంతర్జాతీయం

హఫీజ్ బ్యాచ్ ఢమాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 26: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఉగ్రవాద సంస్థలు, నిషేధిత గ్రూపులకు ఓటర్లు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. ముంబయిపై ఉగ్రదాడిలో సూత్రధారి హఫీజ్ సరుూద్ అల్లాహో అక్బర్ తెహ్రీక్ బ్యానర్‌పై నిలబడి మట్టికరిచాడు. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేసినా ఓటర్లు ఉగ్రవాద సంస్థలను దక్కరకు రానీయలేదు. ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధాలున్న వందలాది మంది జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినా భంగపాటే ఎదురైంది. ఏదో ఒక్కరిద్దరికి మంచి ఓట్లు వచ్చాయే తప్ప అందరూ ప్రజల తిరస్కారానికి గురయ్యారు. వౌలానా మహ్మద్ అహ్మద్ లుధియన్వీకి ఓట్లు బాగానే పడ్డాయి. ఎన్నికల ముందే అతడి గ్రూపుపై నిషేధాజ్ఞలు ఎత్తివేసి పోటీకీ అనుమతి లభించింది. జియో టీవీ కథనం ప్రకారం లుధియన్వీకి 45వేల పైచిలుకు ఓట్లు లభించాయి. సరుూద్‌తో పార్టీ అనుబంధ గ్రూపు మిలి ముస్లిం లీగ్ నుంచి డజన్ల కొద్దీ అభ్యర్థులు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. హఫీజ్ ఎన్నో సభల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. పార్టీ తరఫున ఎక్కువ మందినే ఎన్నికల్లో నిలబెట్టాడు. అయితే ఒక్కరు కూడా గెలవలేదు. హఫీజ్ సరుూద్ కుమారుడు హఫీజ్ తల్హా సరుూద్ ఎన్‌ఏ-91 సీటు సర్గ్ధో నుంచి పోటీ చేశాడు. లాహోర్‌కు 200కిమీ దూరంలో సర్గ్ధో ఉంది. జమాద్ ఉద్ దవా చీఫ్ అల్లుడు ఖలీద్ వలీద్ పీపీ-167 సీటు నుంచి పోటీచేశాడు. ఇక తెహ్రీక్ ఏ లబైక్ పాకిస్తాన్(టీఎల్‌పీ) సున్నీ గ్రూపువంద మందిని పోటీకి నిలబెట్టినా ఫలితం దక్కలేదు. ముతాహిదా మజ్లిస్ ఏ అమ్ల(ఎంఎంఏ) కూడా అనేక మందిని ఎన్నికల బరిలో నిలబెట్టినా ఓటర్లు ఆదరించలేదు. మతపెద్ద వౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ విస్తృతంగా ప్రచారం చేసినా భంగపాటు తప్పలేదు.