అంతర్జాతీయం

మహామహుల పరాజయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 26: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ఉద్ధండులకు ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రజా తీర్పుకు దిగ్గజ నాయకులు బిత్తరపోయారు. మాజీ ప్రధానులు, ప్రధాని అభ్యర్థులూ ఘోరపరాజయం పొందారు. మాజీ ప్రధాని షాహిద్ ఖఖాన్ అబ్బాసీ, ఆయన పార్టీ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, జమాత్ ఇ ఇస్లామీ చీఫ్ సిరాజుల్ హక్ సహా అనేకమంది ప్రముఖులు ఇంటిదారి పట్టారు. అవినీతి ఆరోపణలతో ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్ తప్పుకోగా ఆయన స్థానంలో అబ్బాసీ పదవి చేపట్టారు. అబ్బాసీ రావల్పిండిలోని ఎన్‌ఏ-57 పార్లమెంటరీ నియోజకవర్గం, అలాగే ఇస్లామాబాద్‌లోని ఎన్‌ఏ-53 ముర్రే నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓడిపోయారు. అబ్బాసీ ఓటమి నవాజ్ పార్టీకి కోలుకోలేని దెబ్బంగా పాక్ మీడియా పేర్కొంది. ఎన్‌ఏ 57 స్థానం పీఎంఎల్-ఎన్‌కు పెట్టని కోట. అబ్బాసీ తండ్రి 1985లో తొలిసారి ఇక్కడ గెలిచారు. తరువాత వరుసగా 1990, 1993, 1997, 2008, 2013 సార్వత్రిక ఎన్నికల్లో ఖఖాన్ అబ్బాసీ గెలుస్తూ వచ్చారు. 2002 ఎన్నికల్లో మాత్రం ఆయన పోటమి చెందారు. ఇక పీఎంఎల్-ఎన్ చీఫ్ షాబాజ్ షరీఫ్‌కు ఊహించని షాక్ తగిలింది. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన షాబాజ్ ఒక్క లాహోర్ స్థానంలో ముందంజలో ఉన్నట్టు తెలిసింది. కరాచీ, ఎన్‌ఏ-3 స్వాత్ స్థానాల్లో ఓడిపోయారు. ముత్తాహిదా మజ్లిస్ ఏ అమల్ అధ్యక్షుడు వౌలానా ఫజ్లు రెహ్మాన్ రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారు. డేరా ఇస్మైల్ ఖాన్, లక్కీ మార్వత్ నుంచి ఆయన పోటీ చేశారు. అలాగే నవాజ్ షరీఫ్ అత్యంత సన్నిహితుడు, పంజాబ్ మాజీ న్యాయశాఖ మంత్రి రాణా సనౌలా ఫైసలాబాద్ నుంచి పరాజయం పొందారు. ఫైసలాబాద్ కూడా షరీఫ్ పార్టీకి గట్టిపట్టు ఉన్న నియోజకవర్గమే. అయినా ఓటమి తప్పలేదు. పీఎంఎల్-ఎన్ ప్రముఖ నేత ఖ్వాజా సాద్ రఫీఖ్ లాహోర్‌లో ఓటమి చెందారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ చేతిలో సాద్ పరాజం పాలయ్యారు. సింధ్ మాజీ సీఎం అర్బాబ్ రహీం ఒమెర్‌కోట్‌లో ఓడిపోయారు. అక్కడ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ గెలిచింది. అలాగే జామాత్ ఏ ఇస్లామీ చీఫ్ సిరాజుల్ హక్ ఎన్‌ఏ-7 డిర్‌లో ఓడిపోయారు. కాగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ మలాకండ్ (ఎన్‌ఏ-8)లో ఓడిపోయారు. అయితే గుడ్టిలోమెల్ల అన్నట్టు సొంత నియోజకవర్గం సింధ్‌లోని లర్ఖానా నుంచి గెలిచారు. పాక్ అంతరింగి శాఖ మాజీ మంత్రి, నవాజ్ పార్టీ నేత చౌదరి నిసార్ అలీఖాన్ రెండు చోట్ల పోటీచేసి పీటీఐ అభ్యర్థుల చేతిలో రెండింటా ఓడిపోయారు. ఇక ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పీటీఐ చీఫ్ అన్ని చోట్టా ఆధికత్యత కనబరిచారు.
భారీగా రిగ్గింగ్: నవాజ్ పార్టీ
సార్వత్రిక ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందంటూ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పీఎంఎల్-ఎన్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు పాక్ కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ ముందంజలో ఉందన్న వార్తలు వెలువడుతుండగా పీఎంఎల్-ఎన్ ఈ ఆరోపణలు చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పార్టీ హెచ్చరించింది. ఓ పక్క ఓట్ల లెక్కింపు జరుగుతుండగా పార్టీ చీఫ్ షాబాజ్ షరీఫ్ ఎన్నికల నిర్వహణను తప్పుపట్టారు. విచ్చలవిడిగా రిగ్గింగ్ జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఐదు ప్రధాన పార్టీలూ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించాయి. మరోపక్క పాక్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మహ్మద్ రజా ఖాన్ ఎన్నికల ప్రశాంతగా, స్వేచ్ఛగా జరిగాయని ప్రకటించారు. దేశ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఫలితాలు వెల్లడిలో జాప్యం చోటుచేసుకుందని ఆయన వెల్లడించారు. అలాగే ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరగలేదని ఈసీ కార్యదర్శి బాబర్ యాకూబ్ చెప్పారు. కాగా విజయపథంలో దూసుకెళ్తున్న ఇమ్రాన్‌ఖాన్ పార్టీ నేతలు, కార్యకర్తలు వీధుల్లోకొచ్చి సంబరాలు జరుపుకొంటున్నారు. రాజధాని ఇస్లామాబాద్ సహా దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ గెలుపుతో నయా పాకిస్తాన్ నిర్మిస్తామని పార్టీనేత షాహిద్ ఆలీ ప్రకటించారు.

చిత్రం..పాక్ ఎన్నికల్లో తహ్రీక్-ఈ-ఇన్సాఫ్ ఆధిక్యం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్యల ఆనందహేల