అంతర్జాతీయం

డోక్లామ్‌లో మళ్లీ చైనా సైనిక కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 26: ఇటీవల చైనాతో ఏర్పడిన డోక్లామ్ వివాదం సమసిపోయిందని అనుకుంటున్న సమయంలో, చైనా తన బుద్ధి మార్చుకోలేదని, అప్రమత్తంగా ఉండాలని భారత్‌ను అమెరికా హెచ్చరిస్తోంది. డోక్లామ్ ప్రాంతంలో చైనా దేశం తిరిగి తన సైనిక కార్యకలాపాలను ప్రారంభించిందని, దీని ని అటు భారత్ కాని, ఇటు భూటాన్ కాని అడ్డుకోవడం లేదని అమెరికా ఉన్నత అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం ప్రాంతంపై సార్వభౌమాధికారానికి చైనా ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఈ ప్రాంతంపై మలేసియా, ఫిలిప్పిన్స్ తైవాన్ తదితర దేశాలకు ఉన్న హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ ప్రాంతంలోని పలు దీవులను తన ఆధీనంలో తెచ్చుకోవడానికి మిలటరీని మోహరిస్తోందన్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ సహజవనరులు, ఖనిజాలు, ఆయిల్ వంటి నిక్షేపాలు అధికంగా ఉన్నాయని, వీటిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటే వాణిజ్యపరంగా కూడా మరింత పట్టును పెంచుకోవచ్చునని ఆ దేశం భావిస్తోందని అమెరికాకు చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఎన్.వాగ్నర్ ఆరోపించారు. అమెరికా కాంగ్రెస్‌లో జరిగిన చర్చలో అనె్న వాంగర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ భారత్ సరిహద్దు ప్రాంతంలో చైనా పాల్పడుతున్న అనైతిక కార్యక్రమాలను ఆ దేశం అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.