అంతర్జాతీయం

జపాన్‌కు తుపాను ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, జూలై 27: జపాన్‌లోని పశ్చిమ ప్రాంతానికి తీవ్రమైన తుపాను తాకే ప్రమాదముందని ఆ దేశ అధికారులు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. 200 కిలోమీటర్ల గాలుల వేగంతో ఈ తుపాను రేపటి రాత్రికి జపాన్ ప్రధాన ద్వీపాన్ని తాకే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా జపాన్‌లో తుపానులు ఈశాన్య దిశగా పయనిస్తాయని, ఇప్పుడు వచ్చే తుపాను వాయువ్యదిశగా వస్తోందని అధికారులు చెప్పారు. ఈ తుపాను కారణంగా భారీ వర్షం, బలమైన ఈదురుగాలలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ తుపాను టోక్యోకు 1200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రేపటికి చుగోకు పశ్చిమ ప్రాంతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ నెలలో ఈ ప్రాంతం కురిసిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల 220 మంది మృతి చెందారు. ఈ విపత్తు బారిన పడి అనేకమంది ఇళ్లుకోల్పోయి నిరాశ్రయులుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో మరో తుపాను ప్రమాదం ముంచుకొస్తున్నందున పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

చిత్రం.. పెనుగాలులు వీస్తుండటంతో ఇబ్బందులు పడుతున్న పౌరులు