అంతర్జాతీయం

పాక్‌లో సుస్థిర ప్రభుత్వం డౌటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జూలై 27: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరిగినా సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకాలు అంతంత మాత్రమే. దేశ వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అనేక మంది సీనియర్లు ఓటమి పాలయ్యారు. వీరందరూ ఏకతాటిపైకి వచ్చి సంఘటితంగా పోరాడే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశే్లషకులంటున్నారు. ఎన్నికల ఫలితాలను చూసి ప్రధానమైన రాజకీయ పార్టీలు ఖంగు తిన్నాయి. రిగ్గింగ్ వల్లనే ఓటమి చెందామని ఈ పార్టీలు భావిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు విధానంపై రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాలను చూస్తే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకు 119 సీట్లు వచ్చాయి. ఈ పార్టీనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొదటి నుంచి తమకు పట్టున్న ప్రాంతాల్లో, సీట్లలో పీఎంఎల్ ఎన్, భుట్టో పార్టీలు ఓటమి చెందాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రాజకీయాలు ఏ దిశగా పయనిస్తాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీయేతర పార్టీల నేతలు రిగ్గింగ్ అంశంపై దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ ఉద్యమం ఇమ్రాన్‌ఖాన్‌కు సవాలు విసరనుందని రాజకీయ విశే్లషకులు ఓమైర్ అలావీ చెప్పారు. పంజాబ్ అసెంబ్లీలో 122 సీట్లు తెచ్చుకున్న పీఎంఎల్ నవాజ్ పార్టీ ఇప్పటికే జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలను తిరస్కరించింది. ఈ పార్టీకి జాతీయ అసెంబ్లీలో 68 సీట్లు వచ్చాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (్భట్టో) కూడా ఎన్నికల లెక్కింపు తీరును దుయ్యబట్టింది. కరాచీలో పీపీపీకి గట్టి కోటగా భావించే లైరి నియోజకవర్గంలో ఆ పార్టీ అధినేత బిలావల్ భుట్టో ఓటమి చెందారు. భుట్టో కేపీకే ప్రొవివ్స్‌లో మల్కాండ్ సీటులో కూడా ఓటమి చెందినా, చివరకు సింధ్‌లో లార్కానా సీటులో నెగ్గారు. మతతత్వ పార్టీలుగా ముద్రపడిన జమాత్ ఉలేమా ఇస్లాం, తెహరిక్ ఇ-లబైక్ పార్టీలు కూడా రిగ్గింగ్‌పై ధ్వజమెత్తాయి. ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ప్రత్యర్థి వౌలానా ఫజలుర్ రెహమాన్ కూడా ఓటమి చెందారు. ఎన్నికల జరిగిన తీరుపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ఫలితాలను చూసిన రాజకీయ పార్టీలు విశే్లషణలో పడ్డాయి. ఈ దిశగా ఈ వారమంతా సమావేశాలను ఏర్పాటు చేశాయి. కరాచీలోని లైరి సీటు పీపీపీకి పెట్టని కోట. కాని ఇక్కడ భుట్లో ఓటమి చెందడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కరాచీ ప్రెస్ క్లబ్ వెలుపల ఇమ్రాన్ వ్యతిరేక పార్టీలు నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. ఎంక్యుఎం పార్టీకి చెందిన సీనియర్ నేత డాక్టర్ ఫరూక్ సత్తార్ ఓటమి చెందాడు. దీంతో ఆ పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. ఈ పార్టీ వ్యవస్థాపకుడు ఆల్ట్ఫా హుస్సేన్ ఇప్పటికీ లండన్‌లో ఉన్నాడు. దీంతో ఆ పార్టీ రెండు ముక్కలైంది. కాని ఈ పార్టీకి కరాచీలో పట్టుంది. గత ఎన్నికల తీరును చూస్తే, ఈ పార్టీ చీలిక వర్గ నేత సత్తార్‌కు ఒక లక్ష ఓట్లు ఎప్పుడూ పోలయ్యేవి. కాని ఈ సారి 36వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.
చిత్రం..ఇమ్రాన్ ఖాన్