అంతర్జాతీయం

డిజిటల్ టెక్నాలజీని వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహెన్స్‌బర్గ్, జూలై 27: డిజిటల్ టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను స్వీకరించి అభివృద్ధికి వినియోగించుకోవాలని ప్రధానామంత్రి నరేంద్రమోదీ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. డిజిటల్ టెక్నాలజీ కోసం ఆర్ట్ఫిషీయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డాటా, అనలిటిక్స్ విభాగాల పటిష్టతకు దృష్టిని సారించాలన్నారు. వీటి వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. శుక్రవారం ఇక్కడ బ్రిక్స్ దేశాల సదస్సులో ఆయన మాట్లాడుతూ డిజిటల్ వౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలన్నారు. వీటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ప్రపంచ దేశాలను డిజిటల్, బిగ్ డాటా అనలిటిక్స్ రంగాల్లో మార్పులు కుదిపేస్తున్నాయన్నారు. వీటి వల్ల పరిశ్రమల నుంచి గృహాల వరకు అన్ని విభాగాల్లో ఊహించని సాంకేతిక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఆఫ్రికాతో మొదటి నుంచి భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆఫ్రికా ఖండంలోని దేశాల స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, శాంతి, స్వేచ్ఛ, అభివృద్ధికి భారత్ కృషి చేస్తుందన్నారు. ఇటీవల కాలంలో ఆఫ్రికా, భారత్ దేశాల మధ్య ఆర్థిక, అభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారం పెరిగిందన్నారు. గత నాలుగు సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య వందకుపైగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయని, ఇరు దేశాల నేతలు అనేక ఒప్పందాలపై సంతకాలు చేశారని, దేశాల పర్యటన జరిగిందని చెప్పారు. ఆఫ్రికాలో 40 దేశాలతో భారత్ అభివృద్ధిపై కలిసి పనిచేస్తోందన్నారు. ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా ఇరు దేశాల్లో అభివృద్ధివేగవంతమైందన్నారు. ఆఫ్రికా దేశాలు ప్రాంతీయంగా సహకారాన్ని పెంపొందించేందుకు చేస్తున్న కృషిని ప్రధాని మోదీ స్వాగతించారు. గత మూడు దశాబ్ధాల్లో స్వేచ్ఛా విపణి, వాణిజ్యం వల్ల ప్రపంచీకరణ నేపథ్యంలో ఆఫ్రికా దేశాలు ప్రయోజనం పొందాయన్నారు. 2008లో ప్రపంచ వ్యాప్తం గా ఆర్థిక మాంద్యం తలెత్తిందన్నారు. దీని నుంచి కోలుకునేందుకు ఆయాదేశాల మధ్య పరస్పర సహకారం అనివార్యమైందన్నారు. భారత్ కూడా ఆర్థిక మాంద్యం బారినపడి కోలుకుందన్నారు. అంతకు ముందు ఉగాండా పార్లమెంటులో ఆయన ఇదే అంశంపై మాట్లాడుతూ ఆఫ్రికా ఖండంలోని దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నామని, నిరంతరం ఆర్థిక లావాదేవీలు కొనసాగించేందుకు పది మార్గదర్శకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు.