అంతర్జాతీయం

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అస్సామీ చిత్రానికి మూడు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌ఏంజిల్స్, జూలై 28: అస్సామీ చిత్రం ‘జొహిహోబొటే ధెమాలైట్’ (రెయిన్‌బో ఫీల్డ్స్) మూడు టాప్ అవార్డులను కైవసం చేసుకుంది. ఇక్కడ జరుగుతున్న 3వ లవ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ఉత్తమ మూవీగా సైతం ఎంపికైంది. ఉత్తమ నటిగా దీపన్నితా శర్మ, ఉత్తమ సంగీతంలో అనురాగ్ సైకియా ఎంపికయ్యారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచంలోని దాదాపు 36 దేశాల నుంచి 150 చిత్రాలకు పైగా ఎంట్రీలో పాల్గొన్నాయి. మూడు అవార్డులు దక్కించుకున్న ‘జొహిహోబొటే థెమాలెట్’ అస్సామీ చిత్రానికి దర్శకుడు బిద్యుత్ కొటొకై. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్న అస్సాంలో పిల్లలపై దాని ప్రభావం అనే అంశంపై ఈ చిత్రం రూపొందింది. ఈ సందర్భంగా చిత్రం డైరెక్టర్ మాట్లాడుతూ అస్సాం భాషలో ప్రపంచస్థాయి సినిమా తీయగలమనే నమ్మకం కుదిరిందని అన్నారు. తమ చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా గుర్తించినందుకు గర్వంగా ఉందని, ఇందుకు జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.