అంతర్జాతీయం

31న నేపాల్-ఇండియా తొలి మేధో సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండ్, జూలై 28: నేపాల్-ఇండియా దేశాల తొలి మేధో సదస్సు ఈనెల 31న ప్రారంభం కానుంది. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోడంపై నిర్వహించే సదస్సును నేపాల్ మాజీ ప్రధానమంత్రి, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ మాజీ చైర్మన్ ప్రచండ ప్రారంభించనున్నారు. ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిప్లొమసీ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ (ఏఐడీఏ), నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఈ సదస్సులో ప్రధానోపన్యాసం చేయనున్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే అంశంపై నేపాల్ తొలిసారిగా ఈ సదస్సులో ప్రస్తావించనుందని ఏఐడీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కె.సీ తెలిపారు. ఈ సదస్సు తర్వాత ఇరు దేశాలు ఏటా పలువురి భాగస్వామ్యంతో ఈ తరహా సదస్సులు నిర్వహించనున్నాయి.