అంతర్జాతీయం

అతి పెద్ద పార్టీగా పీటీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 28: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి కొద్దిరోజుల కిందట జరిగిన సాధారణ ఎన్నికల్లో మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పార్టీ 116 స్థానాలు సాధించి అతిపెద్ద ఏకైక పార్టీగా ఆవిర్భవించింది. దేశంలోని మొత్తం 270 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఈ నెల 25న సాధారణ ఎన్నికలు నిర్వహించారు. శనివారం అధికారికంగా తుది ఫలితాలను వెల్లడించగా, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ (16,857,035 ఓట్లుతో) అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. తుది ఫలితాలను పాక్ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వాస్తవానికి ఎన్నికలు జరిగిన వెంటనే ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. కానీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన కొన్ని పార్టీలు ఓటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆందోళన, ఆగ్రహం, ఆరోపణలు చేసిన నేపథ్యంలో తుది ఫలితాల వెల్లడిలో కాస్త జాప్యం జరిగింది. ప్రస్తుతం పాక్ జైలులో నిర్బంధంలో ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ 64 స్థానాల్లో గెలుపొంది రెండో స్థానంలో నిలిచింది. ఈ పార్టీకి 12,894,225 ఓట్లు దక్కాయి. పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్‌ఇ అలీ జర్దారీ నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 43 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ పార్టీకి 6,894,296 ఓట్లు లభించాయి. ముత్తాహిదా మజ్లిస్-ఇ- అమల్ పాకిస్తాన్ (ఎంఎంఏపీ) 13 స్థానాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ పార్టీకి 2,530,452 ఓట్లు దక్కాయి. తెహ్రీక్-ఇ-లబైక్ పార్టీకి 2,191,679 ఓట్లు, అల్లాహో-అక్బర్ తెహ్రీక్ పార్టీకి 171,441 ఓట్లు దక్కాయని పాక్ ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
అయితే, ఈ సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన 13 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రస్తుతం అత్యంత కీలకం కానున్నారు. ప్రస్తుతం 116 అధ్యధిక స్థానాలతో అగ్రస్థానంలో నిలిచిన ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పీపీపీ ఇండిపెండెంట్ల మద్దతు లభిస్తే అతి పెద్ద పార్టీగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలావుండగా, కరాచీలోని ముత్తాహిదా క్వామీ మూమెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎంపీ) గత కొన్ని దశాబ్దాలుగా నగరాన్ని శాసిస్తోంది. ప్రస్తుతం ఈ పార్టీకి జాతీయ అసెంబ్లీలో కేవలం ఆరు సీట్లు మాత్రమే దక్కాయి.