అంతర్జాతీయం

ఆగస్టు 14న ఇమ్రాన్ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ స్వాతంత్య్రదినోత్సవం రోజు ఆగస్టు 14వ తేదీన ప్రధానమంత్రిగా పీటీఐ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో కొత్త ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని, మద్దతు కోసం ఇతర పార్టీలను సంప్రదిస్తున్నామని పీటీఐ పార్టీ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన జరిగిన ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లు తెచ్చుకుని అతి పెద్ద పార్టీగా అవతరించంది. కాని ఈ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. మరో 57 మంది మద్దతు కోసం ఇమ్రాన్ ఖాన్ వేటను ప్రారంభించారు. ఆట మొదలైందని, పూర్తి మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు పీటీఐ పార్టీ నేత నీనుల్ హక్ తెలిపారు. ఈ ఎన్నికల్లో పీటీఐకు 116, నవాజ్ పార్టీకి 64 సీట్లు, భుట్టో పార్టీకి 43 సీట్లు వచ్చాయి. మద్దతు కోసం చిన్న చితకా పార్టీలతో సంప్రదింపులు చేస్తామని, మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని పీటీఐ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎంక్యుఎం, పీఎంఎల్ క్యు, అవామీ ముస్లిం లీగ్, ఇంకా ఇండిపెండెంట్ల మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేర్కొంది. కాగా ఇమ్రాన్ పార్టీని ఏకాకిని చేసేందుకు నవాజ్ పార్టీ, భుట్టో పార్టీల ప్రతినిధులు త్వరలో సమావేశం జరగనుంది. కాగా ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో ఎవరికి ఏ స్థానం లభిస్తుందనే విషయమై ఊహాగానాలు పెరిగాయి. ఇమ్రాన్ ఖాన్ ఐదు సీట్లలో గెలిచారు. ఆయన ఒక సీటును నిలబెట్టుకుని మిగిలిన నాలుగు సీట్లను వదులుకోవాల్సి ఉంటుంది. తక్షసిల నుంచి ఎన్నికైన పీటీఐ అభ్యర్థి గౌలం సర్వార్ ఖాన్ కూడా రెండు సీట్లలో నెగ్గారు. ఆయన కూడా ఒక సీటు వదులుకోవాల్సి ఉంటుంది. కూడికలు, తీసివేతలు పోతే, ఇమ్రాన్ పార్టీ బలం 109కి పరిమితమవుతుందని రాజకీయ విశే్లషకులంటున్నారు.