అంతర్జాతీయం

భిన్నత్వంలో ఏకత్వం భారత్ సొంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 29: భారత ప్రభుత్వం దేశంలోని మతపరమైన మైనార్టీ ప్రజలకు కనీవినీ ఎరుగని విధంగా మతరమైన సదుపాయాలను, స్వేచ్ఛను కల్పిస్తోందని, దీనివల్లనే సుస్థిరమైన ప్రజాస్వామ్యంతో విరాజిల్లుతోందని అమెరికాకు చెందిన హిందూ అడ్వకసీ గ్రూప్ ప్రకటించింది. అందుకే అమెరికా కూడా భారత్‌తో సంబంధాలు బలంగా ఉండాలని కోరుకుంటోంది. భారత్ అనుసరిస్తున్న వైఖరి వల్ల ఇస్లామిక్ ఉగ్రవాదం, మావోయిస్టుల తీవ్రవాదం విస్తరించలేక చతికిలపడ్డాయని ఈ సంస్థ పేర్కొంది. భారత్ ప్రజాస్వామ్యంలో వైవిధ్యం పేరిట ఈ సంస్థ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడించింది. ప్రాచీనకాలం నుంచి భారత్‌కు సంక్రమించిన భిన్నత్వంలో ఏకత్వం, పరమత సహనం దేశానికి బలం అని పేర్కొన్నారు. దేశ రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ డాక్యుమెంట్‌ను హిందూ అడ్వకసీ గ్రూపు విడుదల చేసింది. ప్రపంచంలో నాలుగు మతాలకు జన్మనిచ్చిన దేశం భారత్ అని అందుకే ఇక్కడ అన్ని విశ్వాసాలు వర్ధిల్లుతున్నాయని పేర్కొన్నారు. మతపరమైన మైనార్టీలకు 600 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కేటాయించారన్నార. ముస్లింలు, క్రైస్తవులకు రాయితీలు ఇస్తున్నారన్నారు. ఇంకా ప్రభుత్వం, మిలిటరీ, న్యాయ వ్యవస్థ, ఇతర రంగాల్లో మైనార్టీలు కీలకమైన స్థానాల్లో ఉన్నారన్నారు. ఇటీవల కాలంలో మతపరమైన ఘర్షణలు తగ్గాయన్నారు. హిందుత్వ, భారతీయ సంప్రదాయాలకు ఇతర మతాలపై దాడులు చేయడం విరుద్ధమన్నారు. ఈ ప్రాంతంలో బలోపేతమైన శక్తిగా భారత్ ఎదిగిందన్నారు. భారత్‌తో సంబంధాలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం అమెరికాపై ఉందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో మతపరమైన ఉద్రిక్తతల వల్ల హిందువులు పెద్ద సంఖ్యలో భారత్‌కు వచ్చి స్థిరపడుతున్నారన్నారు. ఈ నివేదికను హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎండి సమీర్ కైరా విడుదల చేశారు. భారత్‌లో వివిధ మతాలకు అపారమైన స్వేచ్చ ఉందని, ఈ కోణంలో అమెరికా మీడియా, విధానాల్లో తగిన ప్రాచుర్యం లభించడంలేదని ఆయన చెప్పారు.