అంతర్జాతీయం

పాక్ జైళ్లలో మగ్గుతున్న 470మంది భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 29: సుమారు 470మందికి పైగా భారతీయులు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. ఇందులో 418మంది మత్స్యకారులే కావడం గమనార్హం. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీ కోర్టుకు సమర్పించిన ఓ నివేదిక ఈ గణాంకాలను వివరించింది. అలాగే పాకిస్తాన్‌కు చెందిన 357 మంది భారత జైళ్లలో శిక్షలను అనుభవిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఇరు దేశాల మధ్య పరస్పర చర్చలకు సంబంధించి నెలకొన్న స్తబ్థత దృష్ట్యా 2013 అక్టోబర్ నుంచి భారత-పాకిస్తాన్ ఖైదీల వ్యవహారంపై ఏర్పాటైన జ్యుడీషియల్ కమిటీ సమావేశం జరగలేదు. మొత్తం 53 మంది భారత పౌరులు, 418 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్లకు పరిమతమయ్యారని ఎక్‌ప్రెస్ ట్రిబ్యూన్ అనే వార్తా సంస్థ తెలియజేసింది. భారత హైకమిషనర్ అందజేసిన వివరాల ప్రకారం చివరిసారిగా జూలై 1న భారత-పాకిస్తాన్ ఖైదీల జాబితాను పరస్పరం ఇరు దేశాల అధికారులు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యల పరిష్కారానికి పాక్ కాబోయే కొత్త ప్రభుత్వాధినేత చొరవ చూపుతున్న నేపథ్యంలో ప్రధాన సరిహద్దు సమస్యలపై చర్చ జరుగుతోంది.