అంతర్జాతీయం

నడిరోడ్డుపై బ్యాలెట్ బాక్స్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జూలై 29: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న విపక్షాల ఆందోళనకు బలం చేకూరే విధంగా కరాచీ, సియాల్‌కోట నగరాల వద్ద ఖాళీ బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు లభించాయి. దీంతో ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు నిజమేనంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలతో దాడిని తీవ్రం చేశాయి. కాగా ఈ ఎన్నికల్లో స్వేచ్ఛపై ఆంక్షలు విధించారని, అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు సమానావకాశాలు ఇవ్వలేదని ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన ఐరోపా యూనియన్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీకి 116 సీట్లు వచ్చిన విషయం విదితమే. ఈ ఎన్నికల ఫలితాలను తిరస్కరిస్తున్నట్లు ఇప్పటికే నవాజ్ పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నవాజ్ పార్టీ కోరింది. కాగా సియాల్‌కోట, కరాచీ రోడ్లపై దొరికిన ఖాళీ బ్యాలెట్ బాక్స్‌లపై పీపీపీ అభ్యర్థి మొజ్జమ్ అలీ ఖురేషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరాచీలో ఖయ్యూమాబాద్ ఏరియాలో చెత్తకుండీ వల్ల ఖాళీ బ్యాలెట్ బాక్సులు దొరికాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివరాలను పోలీసు డీఐజీ అమీర్ ఫరూకీ తెలిపారు. ఈ విషయమై సంబంధిత జిల్లా రిటర్నింగ్ అధికారిని విచారణకు ఆదేశించాలని డిఐజిని ప్రభుత్వం కోరినట్లు సమాచారం. సియాల్‌కోట్ కంటోనె్మంట్ ఏరియాలో కాశ్మీర్ పార్కు వద్ద ఐదు ఖాళీ బ్యాలెట్ బాక్సులు, 12 బ్యాలెట్ పత్రాలు దొరికాయి. గుర్తు తెలియని వ్యక్తులు వీటిని పారేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఈ నియోజకవర్గంలో ఓటమి చెందిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ అభ్యర్థి ఉస్మాన్ దర్ ఈ విషయం తెలిసిన వెంటనే ఘటనా ప్రదేశానికి వెళ్లారు. ఇక్కడ ఎన్నికల్లో నవాజ్ పార్టీ అభ్యర్థి గెలిచారు. ఈ బ్యాలెట్ బాక్సులను నవాజ్ పార్టీ అభ్యర్థి పారవేసి ఉంటారని ఇమ్రాన్ పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలను నవాజ్ పార్టీ తోసిపుచ్చింది.
కాగా ఐరోపా యూనియన్‌కు చెందిన అధికారులు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించి తమ నివేదికను ఇచ్చారు. జర్నలిస్టుల కదలికలపై ఆంక్షలు విదించారని పేర్కొన్నారు. రిగ్గింగ్, ఆంక్షలు విధించామన్న ఆరోపణలను పాకిస్తాన్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. కాగా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సైనిక మద్దతు ఉందని, అందుకే గెలిచారని వివిధ రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. 172 సీట్లు లభిస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాని ఈ ఎన్నికల్లో 116 సీట్లను నెగ్గి ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన ఇమ్రాన్ పార్టీ పీటీఐకు ఇండిపెండెంట్లు,చిన్న పార్టీలనుంచి మద్దతు అవసరమవుతోంది. వీరి సహకారం కోసం ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.