అంతర్జాతీయం

నవాజ్ షరీఫ్‌ను ఆసుపత్రికి తరలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 29: అవినీతి కేసులో జైలుపాలైన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఆపద్ధర ప్రభుత్వం జైలు అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం రావల్పిండిలోని ఆడియాల జైలులో నవాజ్ ఉన్నారు. గుండె నొప్పితో నవాజ్ ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రాథమిక వైద్య చికిత్సను అందించారు. అనంతరం ప్రభుత్వం ఆదేశంపై ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్‌కు తరలించాలని నిర్ణయించారు. 68 ఏళ్ల నవాజ్ షరీఫ్‌కు అవినీతి కేసులో కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించిన విషయం విదితమే. మాజీ ప్రధాని నవాజ్ ఆరోగ్యం బాగాలేదని, వెంటనే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రికి తరలించాలని జైలు డాక్టర్లు నివేదిక ఇచ్చారు. ఆదియాల జైలు పంజాబ్‌లో ఉంది. దీంతో పంజాబ్ ప్రభుత్వం నవాజ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించింది. ఇప్పటికే ఇస్లామాబాద్‌లోని ఆసుపత్రిలో షరీఫ్‌కు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.