అంతర్జాతీయం

శిశు మరణాల శాతం తగ్గింపులో భారత్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 5: భారత్‌లోని ఇంచుమించు సగం రాష్ట్రాలు శిశుమరణాల సంఖ్య తగ్గింపులక్ష్యం దిశగా ఏమాత్రం సాగడం లేదని ఒక నివేదిక వెల్లడించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అప్లయిడ్ సిస్టమ్స్ అనాలసిస్‌కు చెందిన జయంత్ బోర, నందిత సైకియా చేపట్టిన పరిశోధన అనంతరం ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా 1.1 మిలియన్‌ల శిశువులు ప్రతిఏడాది జన్మిస్తుండగా ఇందులో 0-5 సంవత్సరాల పిల్లల మరణాల సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉందని వారు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సస్టయినబుల్ డెవలప్‌మెంట్ గోల్ 3 (ఎస్‌జిజి3) కింద నిర్దేశించిన లక్ష్యం దిశగా భారత్‌లోని సగం రాష్ట్రాలు ఎంతమాత్రం ముందుకు పోవడం లేదని అన్నారు. ఈ గోల్ కింద ప్రతి వెయ్యి మందిలో పుట్టిన శిశువుల మరణాలు ఏడాదికి ఐదుకు, ఐదు సంవత్సరాల లోపు పిల్లల గరిష్ట మరణాలు 25కు మించరాదని అన్ని దేశాలకు లక్ష్యం విధించారన్నారు. తాము భారత్‌లో చేపట్టిన కుటుంబ సర్వే ప్రకారం ఐదేళ్లలోపు పిల్లల మరణాలు గత 23 ఏళ్లుగా సగం వరకు తగ్గాయన్నారు. 1990 వరకు ఈ మరణాల సంఖ్య ప్రతివేయికి ఏడాదికి 109 ఉండగా, 20-13 వచ్చేసరికి వాటి సంఖ్య 50కు తగ్గిందన్నారు. అయితే ఇది ఇంకా తగ్గాలన్నారు. ఎస్‌డీజీజీ 3 లక్ష్యానికి ఇది రెట్టింపు అని అన్నారు.