అంతర్జాతీయం

ప్రధానిగా నేడు ఇమ్రాన్ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 5: పాకిస్తాన్ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా సోమవారం ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు ఈ పార్టీ వర్గాలు ఆదివారం స్పష్టమైన సంకేతాలను అందించడంతోపాటు ఇమ్రాన్ తన తొలి మంత్రివర్గాన్ని 15 నుంచి 20 మందితో ఏర్పాటు చేయవచ్చునని స్పష్టం చేశాయి. అయితే, దేశ ప్రధానిగా ఇమ్రాన్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నదానిపై ఇప్పటివరకు వివిధ తేదీలు తెరపైకి వచ్చినప్పటికీ పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజైన 14వ తేదీనే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్‌లో తమ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుందని, అక్కడే దేశ ప్రధానిగా ఇమ్రాన్‌ను ఎన్నుకోవడం జరుగుతుందని పార్టీ ప్రతినిధి ఫవాగ్ చౌదరిని ఉటంకిస్తూ జియో న్యూస్ చానల్ తెలిపింది. ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ ఇతర పార్టీ ల మద్దతును కూడగట్టుకోవడం ద్వారా తగిన మెజారిటీని తమ పార్టీ సంతరించుకుందని తెలిపారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ప్రకటించడంతో ఇమ్రాన్ పార్టీ బలం జాతీయ అసెంబ్లీలో 125కు పెరిగింది. అలాగే మిగతా మిత్రపక్షాలు రిజర్వు స్థానాలను కలుపుకుంటే 174కు చేరుకుంటుందని వెల్లడించారు. మరోపక్క బలూచిస్తాన్ జాతీయ పార్టీ కూడా తమకు మద్దతు ప్రకటించిందని, దీంతో తమ బలం 177కు చేరే అవకాశం కూడా ఉందని ఆయన వెల్లడించారు.