అంతర్జాతీయం

లాల్‌బహదూర్‌కు సుష్మ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాష్కెంట్, ఆగస్టు 5: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో ఆదివారం నాడు పర్యటించారు. భారత రెండవ ప్రధాన మంత్రి లాల్‌బహదూర్ శాస్ర్తీకి అక్కడ ఉన్న స్మారక చిహ్నం వద్ద సుష్మ పుష్పమాలికలతో నివాళులు అర్పించారు. శనివారం నాడు తొలిసారిగా తాష్కెంటుకు చేరుకున్న సుష్మ ఆదివారం ఉదయం లాల్‌బహదూర్ శాస్ర్తీ స్మారక చిహ్నం వద్దకు వచ్చారు. భారత దేశ స్వాతంత్య్ర సమర యోథులు, రెండవ ప్రధాన మంత్రికి తాను పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించినట్లు మంత్రి సుష్మ తెలిపారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి రవీష్‌కుమార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ఫొటోను సైతం ట్విట్టర్‌లో ఉంచారు. అక్కడ లాల్‌బహదూర్ శాస్ర్తీ కాంస్య విగ్రహాన్ని రూపొందించిన శిల్పి యకోవ్ షపిరోను ఈ సందర్భంగా సుష్మ కలిసి ప్రత్యేకంగా అభినందించారు. 1966లో భారత పాకిస్తాన్ యుద్ధానికి చరమగీతం పలుకుతూ తాష్కెంట్ వెళ్లి అక్కడ చారిత్రాత్మక తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేసిన లాల్‌బహదూర్ శాస్ర్తీ అక్కడే మృతిచెందారు. ఈ క్రమంలో ఆయన జ్ఞాపకార్థం అక్కడి ప్రభుత్వం కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. కాగా అంతకు ముందు మంత్రి సుష్మ ఉజెబకిస్తాన్ అసెంబ్లీ స్పీకర్ నుర్డిన్జాన్ ఇస్మాయిలోవ్‌తో సంప్రదింపులు జరిపి అక్కడి పరిపాలనా వ్యవహారాలపై, ఇరు దేశాల పరస్పర సహకారాలపై చర్చించారు. అలాగే ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులతోనూ ఆమె ఈ సందర్భంగా సమావేశమయ్యారు. వారి ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటైన మామిడి పండ్ల ప్రదర్శన ఉత్సవాన్ని మంత్రి ప్రారంభించారు. తాష్కెంట్‌లోని మాంగో ఎక్స్‌ప్రెస్ అనే సంస్థతో కలిసి మన దేశంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎగుమతి వ్యాపారస్థుల ద్వారా అక్కడ ఈ మ్యాంగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. భారతీయ మామిడి ప్రాముఖ్యతను తెలిపేందుకే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు తెలిపారు. అంతటా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రజల్లో ప్రత్యేక గౌరవం ఉందని మంత్రి తెలిపారు.