అంతర్జాతీయం

విమానం కూలి 20మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా: విమానం కూలిన ప్రమాదంలో 20మంది మృతి చెందిన సంఘటన స్విట్జర్లాండ్‌లో జరిగింది. స్విస్ ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఈ విమానం టిసినో నుంచి బయలుదేరింది. ఇందులో 17 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో ఉన్న ఈ విమానం పర్వత ప్రాంతంలో శనివారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 20 మంది మృతి చెందినట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. విమానం హఠాత్తుగా 180 డిగ్రీల కోణంలో దక్షిణం వైపుకు తిరిగి కొండను ఢీకొని పేలిపోయిందని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. సంఘటనా స్థలానికి ఐదు హెలికాప్టర్లను పంపించి రక్షణ చర్యలు చేపట్టారు. అయితే విమానంలో ఎవరూ బతికి లేరని వారు నిర్ధారించారు.