అంతర్జాతీయం

శాంతి స్థాపనకు భారత్ కృషి అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, ఆగస్టు 5: ప్రపంచ శాంతి స్థాపనకు భారత్ చేస్తున్న కృషి అమోఘమని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ స్థిరంగా నిలబడిన భారత్ శాంతి కోసం అన్ని విధాలా సహకరించడం ముదావహమని పేర్కొంది. అవసరాలను గుర్తించి, అందుకు దీటైన స్థాయిలో సేవలు అందించడానికి భారత్ ఎప్పుడూ ముందు ఉంటున్నదని శాంతి పరిరక్షణ వ్యవహారాల అండర్ సెక్రటరీ జనరల్ జీన్ పియరీ లాక్రోక్స్ అన్నారు. ఐరాస ఆధ్వర్యంలోని పౌర సమాచార విభాగం (డీపీఐ) 70వ వార్షికోత్సవ సందర్భంగా చేపట్టిన 3యూఎన్ పీస్ కీపింగ్-సర్వీస్ అండ్ శాక్రిఫైస్2 పేరుతో జరుగుతున్న కార్యక్రమాల నేపథ్యంలో ఇక్కడ ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రపంచం దేశాల్లో శాంతి స్థాపన కోసం భారత్ ఎంతో మందిని వలంటీర్లుగా పంపుతున్నదని తెలిపారు. వారానికి ఒక దేశాన్ని ఎంచుకొని, శాంతి స్థాపనకు ఆ దేశం అందిస్తున్న సేవలను ప్రస్తావించడం, గుర్తుచేసుకోవడాన్ని ఐరాస ప్రధాన ఎజెండగా ఎంచుకుంది. అందులో భాగంగానే, పలు సందర్భాల్లో భారత్ చేసిన, చేస్తున్న సేవలను లాక్రోక్స్ కొనియాడారు. పౌర హక్కులను కాపాడడం నుంచి ఘర్షణల నివారణ వరకూ అనేకానేక సందర్భాల్లో ఐరాసకు భారత్ ఇతోధిక సహాయ సహకారాలు అందిస్తున్నదని అన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే, భారత్ ఎక్కువ మంది శాంతి సేవకులను కోల్పోయిందని, అయినప్పటికీ వెనుకంజ వేయకుండా ముందుకు సాగుతున్నదని వ్యాఖ్యానించారు. భారత్ సహకారం భవిష్యత్తులోనూ ఇదే విధంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.