అంతర్జాతీయం

ప్రధాని అభ్యర్థిగా ఇమ్రాన్ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 6: ఇమ్రాన్‌ఖాన్‌ను పాకిస్తాన్ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇటీవల ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్ఫాఫ్(పీటీఐ) మంగళవారం ఇక్కడ సమావేశమైంది. 65 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు పీటీఐ పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమైన పీటీఐ పార్లమెంటరీ కమిటీ ఇమ్రాన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు, పీటీఐ ప్రముఖ నేతలు సమావేశానికి హాజరయ్యారు. షా మహ్మద్ ఖురేషీ, అసద్ ఉమర్,పర్వేజ్ ఖట్టక్, చౌదరీ సర్వార్, ఫహద్ చౌదరీ, అరీఫ్ అల్వీ, సఫ్ఖడ్ మహమూద్ తదితరులు హాజరయ్యారు.