అంతర్జాతీయం

రెండోరోజూ నేపాల్‌కే పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాడ్మండూ, ఆగస్టు 6: కైలాస-మానస సరోవర్ తీర్థయాత్రకు వెళ్లిన సుమారు 175 మంది భారతీయులు రెండు రోజులుగా నేపాల్‌కే పరిమితమయ్యారు. యాత్ర ముగించుకుని ఇళ్లకు తిరుగుముఖం పట్టిన వీరు అనివార్యంగా నేపాల్‌లోనే ఉండాల్సి వచ్చింది. వాతావరణం సహకరించకపోవండంతో విమాన రాకపోకలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రెండోరోజైన సోమవారం కూడా ఈ యాత్రికులు నేపాల్‌లోని హమ్లా జిల్లాలోనే ఉండిపోయారని భారత రాయభార కార్యాలయ అధికారులు తెలిపారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చిన వెంటనే యాత్రికులకు సురక్షితంగా వారి ప్రాంతాలకు పంపడం జరుగుతుందని, ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులన్నీ సవ్యంగానే ఉన్నాయని రోషన్ లెప్కా అనే రాయభార కార్యాలయ ప్రతినిధి వివరించారు.