అంతర్జాతీయం

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఇమ్రాన్‌ఖాన్‌కు తాఖీదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 9: కాబోయే ప్రధాని, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల నియమావళిని ఉలంఘించినందుకు రాతపూర్వకంగా భేషరతుగా క్షమాపణ చెప్పాలని పాకిస్తాన్ ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు తాఖీదులు జారీ చేసింది. గత నెల 25వ తేదీన పాకిస్తాన్‌లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎక్కువ సీట్లు తెచ్చుకుని ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇమ్రాన్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ చైర్మన్‌గా ఉన్న నలుగురు సభ్యుల కమిటీ విచారించింది. పోలింగ్ రోజు ఓటుహక్కును వినియోగించుకునే సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఫిర్యాదు వచ్చింది. బహిరంగంగా బ్యాలెట్‌పత్రంపై ఓటు వేయడం తగదని ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా తన క్లైంటు దురుద్దేశపూర్వకంగా బహిరంగంగా ఓటు చేయలేదని ఇమ్రాన్ ఖాన్ తరఫున న్యాయవాది బాబర్ అవాన్ చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ఓటువేసే సమయంలో జనం తోసుకుని వచ్చారన్నారు. తొక్కిసలాటలో తెర పడిపోయిందన్నారు. కాని ఈ సమాధానాన్ని ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఎన్నికల నియమావళిని ఇమ్రాన్ ఖాన్ ఉల్లంఘించారని, ఈ ఘటనపై బహిరంగ క్షమాపణ తెలియచేయాలని, రాతపూర్వకంగా ఇవ్వాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ అంశంపై ఈ నెల 10వ తేదీన కూడ విచారణ జరగనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటును రహస్యంగా వేయని పక్షంలో ఆరు నెలల జైలు, వెయ్యి రూపాయల జరిమానాను విధించే ఆస్కారముంది. ఇమ్రాన్ ఖాన్ ఐదు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అన్ని చోట్ల గెలిచారు. కాగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంతో, ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం విచారించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.