అంతర్జాతీయం

ఐరాస మానవ హక్కుల హై కమిషనర్‌గా మైఖేల్ బాచీలెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, ఆగస్టు 9: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ హై కమిషనర్‌గా చీలీ దేశ తొలి మహిళా అధ్యక్షురాలు మైఖే ల్ బాచీలెట్ నియమితులుకానున్నారు. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గెటిర్రెస్ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. జోర్డాన్‌కు చెందిన రాయబారి జైడ్ రాడ్ ఆల్ హుస్సేన్ ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో లైంగిక దారుణాలు, దాడులను ఖండించడమేకాకుండా, వాటి నిరోధానికి మైఖేల్ బాచీలెట్ ఎనలేని కృషి చేశారు. అనేక దేశాల గ్రూపులతో సంప్రదించి మైఖేల్ బాచీలెట్ నియామకాన్నిఖరారు చేసినట్లు ఆయన చెప్పారు. ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది. ఈదేశాల ప్రతినిధులకు ఈ సమాచారం తెలియచేశారు. చీలీ దేశానికి రెండు సార్లు అధ్యక్షురాలిగా మైఖేల్ బాచీలెట్ చేశారు.