అంతర్జాతీయం

ఇక సూర్యుడిపైనే గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంపా (అమెరికా), ఆగస్టు 10: నాసా అంతరిక్ష ప్రయోగశాల నుంచి 1.5 బిలియన్ డాలర్లతో రూపొందించిన అంతరిక్ష నౌకను సూర్యగ్రహం వాతావరణ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ అంతరిక్ష నౌకను ఆదివారం ప్రయోగించనున్నారు. ఫ్లోరిడాలోని కేప్ కెనెరవాల్‌నుంచి డెల్టా హెవీ రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. స్థానిక కాలమాన ప్రకారం 3.33 గంటలకు ప్రయోగిస్తామని నాసా పేర్కొంది. సూర్య గ్రహం చుట్టూ ఉన్న వాతావరణంలోని రహస్యాలను కనుగొనేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడుతాయి. సూర్యుడి చుట్టూ వాతావరణంలో ఉష్ణోగ్రతల మార్పులను తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. సూర్యుడి ఉపరితలం కంటే 300 రెట్లు ఎక్కువగా వేడి ఉంటుంది. పార్కర్ సోలార్ ప్రోబ్ అంతరిక్ష నౌక ప్రయోగం వల్ల సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు, గాలులు భూమండలాన్ని కచ్చితంగా ఎప్పుడు తాకుతాయనే అంశంపై విలువైన విషయాలు తెలుస్తాయని ప్రాజెక్టు సైంటిస్టు జస్టిన్ కస్పర్ చెప్పారు. అంతరిక్ష నౌక పార్కర్ సోలార్ ప్రోబ్‌కు వేడి నుంచి రక్షణ పొందేందుకు 4,5 ఇంచుల మందంతో కవచాన్ని ఏర్పాటు చేశారు. సూర్యుడి నుంచి వెలువడే రేడియో ధార్మికత వేడిని తట్టుకుని ఉండే విధంగా షీల్డ్‌ను నిర్మించారు. సూర్య మండలం రహస్యాలను తెలుసుకునేందుకు ఈ ప్రయోగం సహాయపడుతుందని మరో శాస్తవ్రేత్త నికీ ఫాక్స్ చెప్పారు.