అంతర్జాతీయం

అలా చేయడం తప్పే.. క్షమించండి : ఇమ్రాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 10: ఎన్నికల్లో ఓటు వేసేందుకు పాటించాల్సిన గోప్యత నిబంధనను ఉల్లంఘించి, బహిరంగంగా ఓటు వేసినందుకు పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌ఖాన్ ఎలక్షన్ కమిషన్‌కు బేషరతుగా రాతపూర్వక క్షమాపణ చెప్పారు. వచ్చే వారంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌కు ఈ వివాదం అవరోధంగా మారుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఆయన క్షమాపణ చెప్పి వివాదానికి తెరదించారు. అతని రాతపూర్వక క్షమాపణను పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ (ఇసిపి) 3-1 ఓటింగ్‌తో అంగీకరించింది. అంతేకాకుండా ఇస్లామాబాద్ ఎన్‌ఎ-53 నియోజకవర్గం నుంచి అతను ఎన్నికైనట్టు ప్రకటించింది. జూలై 25న జరిగిన పాక్ ఎన్నికల్లో తెహ్రీక్-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడైన ఇమ్రాన్‌ఖాన్ ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వచ్చారు. ‘నా బ్యాలెట్ పేపర్‌ని టేబుల్ పై పెట్టి దానిపై ముద్ర వేయమని అడిగారు, బ్యాలెట్‌పై ఎక్కడ ముద్ర వేయాలని అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి ఓటేశాను, అయితే ఈ ప్రక్రియ అంతా అక్కడ ఉన్న మీడియా రికార్డు చేసింది. దాంతో నేను బహిరంగంగా ఓటు వేసినట్టు ప్రచారం జరిగింది. వాస్తవానికి ఇది నేను ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు’ అని తొలుత ఇమ్రాన్ ఖాన్ ఇసీపీకి వివరించారు. అయితే అతని వివరణకు సంతృప్తి చెందని ఇసీపీ రాతపూర్వక క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. దాంతో ఖాన్ తరఫున బాబర్ అవాన్ నలుగురు సభ్యుల బెంచి ముం దు బేషరతు రాతపూర్వక క్షమాపణ పత్రాన్ని దాఖలు చేశారు.