అంతర్జాతీయం

భారత స్వాతంత్య్ర వేడుకలకు వ్యతిరేకంగా నేడు ఖలిస్తాన్ కార్యకర్తల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 11: భారతదేశంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్ ప్రాంతంలో ఆదివారం ఖలిస్తాన్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీ జరపనున్నారు. భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక ఖలిస్తాన్ ఏర్పాటు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఎంతోకాలం నుంచి ఒక వర్గానికి చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ వర్గం ప్రశాంతంగా జరిపే ర్యాలీకి తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని లండన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ర్యాలీకి లండన్ పరిధిలోని వేలాదిమంది హాజరవుతారని తాము విశ్వసిస్తున్నామని ర్యాలీ నిర్వాహకుడు నవదీప్ సింగ్ అన్నారు. తమ హక్కుల సాధన కోసం ప్రశాంతంగా, న్యాయబద్ధంగా, ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ర్యాలీ నిర్వహించుకోవడం ప్రతిఒక్కరి హక్కు అని, ఇందుకు తామేమీ అభ్యంతరం చెప్పబోమని యూకే ప్రభుత్వ విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. బ్రిటీష్ సిఖ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రమీ రేంజర్ మాట్లాడుతూ ఖలిస్తాన్ ర్యాలీ నిర్వహించడం అవివేకమని అంటూ, ఈ వాదన వినిపిస్తున్నవారు పంజాబ్ వెళ్లి ప్రత్యేక ఖలిస్తాన్ కోసం పోరాడాలని సూచించారు.