అంతర్జాతీయం

వ్యోమనౌక ప్రయోగం నేటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంపా (అమరికా): సూర్య మండలానికి పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక ప్రయోగాన్ని ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు నాసా అంతరిక్ష ప్రయోగ సంస్థ ప్రకటించింది. ఈ వ్యోమనౌకను సూర్య గ్రహం బాహ్య వాతావరణం కరోనాలోకి పంపి అక్కడి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు పంపించాలని అమెరికా అంతరిక్ష శాస్తవ్రేత్తలు నిర్ణయించారు. ఈ వ్యోమనౌకను ఆదివారం తెల్లవారుజామున 3.31 గంటలకు ప్రయోగిస్తామని నాసా పేర్కొంది. హీలియమ్ గ్యాస్ ఆలారమ్ మోగడంతో ఈ వ్యోమనౌక ప్రయోగాన్ని ఒక రోజు వాయిదా వేశామన్నారు. ఈ వ్యోమనౌక ప్రయోగానికి వాతావరణ పరిస్థితు 60 శాతం అనుకూలంగా ఉండాలి. సూర్యుడి బాహ్య వాతావరణం అంటో కరోనా వల్ల సూర్యుడి నుంచి వెలువడే గాలులు, సౌర తుపాన్ల వివరాలను అధ్యయనం చేయాలనే లక్ష్యంతో పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ప్రయోగిస్తున్నామన్నారు. ప్రయోగం సఫలమైతే, సూర్యు మండలానికి అతి దగ్గరగా ఈ వ్యోమనౌక వెళుతుంది. సూర్య మండలం వద్ద 2500 డిగ్రీలఫారన్ హీట్ ఉష్ణోగ్రత ఉంటుంది. దానిని తట్టుకునే విధంగానే పార్కర్ రక్షణ కవచాన్ని నిర్మించారు. సూర్యమండలంలో అనేక రహస్యాలు ఉన్నాయని, వీటిని చేధించేందుకు అనేక వ్యయ ప్రయాసలను తట్టుకుని నిలబడాల్సి ఉంటుందని సైంటిస్టు నికీ ఫాక్స్ చెప్పారు.