అంతర్జాతీయం

పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 17: పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా మాజీ క్రికెట్ స్టార్, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీలో ప్రధానమంత్రి పదవి కోసం పీటీఐ పార్టీ తరఫున ఇమ్రాన్ ఖాన్, పీఎంఎల్ నవాజ్ పార్టీ నుంచి షాబాజ్ షరీఫ్ పోటీపడ్డారు. కాగా ఓటింగ్ సమయంలో పీపీపీకి చెందిన 54 మంది సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఓటింగ్‌లో 176 ఓట్లు ఇమ్రాన్ ఖాన్‌కు, నవాజ్ పార్టీ అభ్యర్థి షాబాద్ షరీఫ్‌కు 96 ఓట్లు పోలయ్యాయి. అనంతరం నేషనల్ అసెంబ్లీ సభా నేతగా, ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ఎన్నికైనట్లు స్పీకర్ అసాద్ ఖైసీర్ ప్రకటించారు. కాగా ఇమ్రాన్ ఎన్నిక పట్ల నవాజ్ షరీఫ్ పార్టీకి చెందిన సభ్యులు నిరసనలు వ్యక్తం చేసి సభలో నినాదాలు చేశారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 172 మంది మద్దతు అవసరం. కాగా ఇమ్రాన్ ఖాన్‌కు 176 ఓట్లు వచ్చాయి. కాగా ఓటింగ్‌లో జమాతే ఇస్లామీ పార్టీ పాల్గొనలేదు. ఓటింగ్‌లో ఇమ్రాన్‌కు అనేక చిన్న పార్టీలు మద్దతు తెలిపాయి. ఎంక్యుఎం, బెలూచిస్తాన్ అవామీ పార్టీ, బలూచిస్తాన్ నేషనల్ పార్టీ, పకిస్తాన్ ముస్లిం లీగ్, గ్రాండ్ డెమాక్రటిక్ అలయెన్స్, అవామీ ముస్లిం లీగ్, జమోరి వాటన్ పార్టీలు మద్దతు తెలిపాయి. పీపీపీ పార్టీ ఓటింగ్‌కు గైర్హాజరుకాకుండా నవాజ్ పార్టీ ప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.