అంతర్జాతీయం

చంద్రుడిపై మంచు నిక్షేపాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 21: చంద్రుడిపైన మంచు రూపంలో గడ్డకట్టిన జలనిధి ఉందని శాస్తవ్రేత్తలు నిర్ధారించారు. చంద్రుడిపై అత్యంత శీతల ప్రాంతాల్లో మంచు గడ్డలు ఉన్నాయి. చంద్రయాన్-1 అంతరిక్ష నౌక ద్వారా సేకరించిన వివరాల్లో ఈ విశేషాలను కనుగొన్నారు. చంద్రయాన్-1ను భారత్ పదేళ్ల క్రితం ప్రయోగించగా, కొంత డాటాను పంపించింది. మంచు రూపంలో జల నిధి ఉండడం ఆశాజనకమైన అంశమని, దీని వల్ల భవిష్యత్తులో మానవులు నివసించేందుకు ఉపయోగపడుతాయనే ఆశలు చిగురించాయని శాస్తవ్రేత్తలు చెప్పారు. చంద్రుడి ఉపరితలం దిగువున ఈ మంచు గడ్డలు ఉన్నాయి. పీఎన్‌ఏఎస్ అనే శాస్త్ర పరిశోధన నివేదికలో ఈ అంశానికి సంబంధించిన ఆసక్తివివరాలతో వ్యాసం ప్రచురితమైంది. ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద మంచు గడ్డలు ఉన్నాయి. నాసా చంద్రుడి ఖనిజసంపద మ్యాపర్ ద్వారా ఈ అంశాలను ధృవీకరించారు. చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్‌ను 2008లో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించింది. మంచుగడ్డలో ద్రవ రూపంలో ఉన్న నీరు, ఆవిరి నీరు, ఘనీభవించిన నీటి వివరాలను కూడా తెలుసుకున్నారు. ఇక్కడ మైనస్ 156 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ప్రాంతాలకు సూర్యరశ్మి చేరదు. చంద్ర గ్రహం భ్రమణం తిరిగే విధానం వల్ల ఈ ధృవప్రాంతాలకు సూర్య కిరణాలు చేరవు. రానున్న రోజుల్లో ఈ కోణంలో విస్తృత పరిశోధనలు జరిపేందుకు అవకాశం ఉంది. చంద్రుడిపైకి తొలి అంతరిక్ష నౌకను ఇస్రో ప్రయోగించింది. ఈ ఉపగ్రహం ప్రయోగించిన తర్వాత 2009 ఆగస్టు 28వ తేదీతో సాంకేతిక కారణాల వల్ల పనిచేయలేదు. చంద్రయాన్-1 స్థితిని తెలుసుకునేందుకు నాసా రాడార్ ఆధారిత వ్యవస్థ ద్వారా ప్రయోగాలు నిర్వహించింది. చంద్రయాన్ రెండేళ్ల పాటు పనిచేసి నిలిచిపోయినా, 95 శాతం లక్ష్యాలను సాధించినట్లు అంతరిక్ష శాస్తవ్రేత్తలు చెప్పారు.