అంతర్జాతీయం

నా జోలికొస్తే అమెరికా మటాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 23: తనను అమెరికా కాంగ్రెస్ అభిశంసిస్తూ తీర్మానం ప్రవేశపెడితే స్టాక్‌మార్కెట్ కుప్పకూలుతుందని, అమెరికన్లు పేదలుగా మారుతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హౌస్ ఆఫ్ రిప్రంజెంటీవ్‌స్‌లో ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ ఉంది. అభిశంసన తీర్మానం చేయాలా వద్ద అనే విషయమై ఇక్కడే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఫాక్స్ న్యూస్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ దేశానికి గొప్ప సేవలు అందిస్తున్న వ్యక్తిపైన అభిశంసన చేస్తారని ప్రశ్నించారు. నిజంగా నాపైన అభిశంసన తీర్మానం చేస్తే అమెరికా మార్కెట్లు పతనమవుతాయి. ఇవేమీ తెలియకుండా అభిశంసన చేస్తారనడం సరికాదు అని ట్రంప్ అన్నారు. డెమాక్రటిక్ పార్టీ మాత్రం అభిశంసన పట్ల ఆసక్తిని కనపరచడంలేదు. వచ్చే నవంబర్‌లో కొన్ని స్థానాల్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ గెలుపుకోసం దృష్టిని సారించింది. అమెరికా చరిత్రను విశే్లషిస్తే 1868లో ఆండ్య్రూ జాన్సన్, 1998లో బిల్ క్లింటన్‌ను అభిశంసించారు. ఇంతవరకు హౌస్‌లో 60 సార్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 15 మంది జడ్జిలను అభిశంసన తీర్మానం పెట్టి ఓటింగ్ ద్వారా తొలగించారు. అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత ట్రంప్ తొలిసారిగా ఈ నెల 21వ తేదీన తీవ్రమైన అభియోగాన్ని ఎదుర్కొన్నారు. ఆయన వద్ద న్యాయవాదిగా పనిచేసిన మైఖేల్ కోహెన్ తనకు ట్రంప్ నిధులు ఇచ్చారని, వీటిని ఒక మోటల్, మరో నటికి ఇచ్చానని చెప్పారు. వారు ట్రంప్‌పైన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆరోపణలు చేయకుండా ఈ నిధులు ముట్టచెప్పినట్లు కోహెన్ పేర్కొన్నారు. కాగా ట్రంప్ ఫాక్స్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మరో ఆరోపణ చేశారు. న్యాయ శాఖపై అటార్నీ జనరల్ పట్టుసాధించలేకపోయారన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దేశంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందన్నారు.