అంతర్జాతీయం

జాదవ్ కేసులో బలమైన రుజువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 23: భారత నౌక దళమాజీ అధికారి కులభూషణ్ జాదవ్ పాక్ గడ్డపై గూఢాచర్యానికి పాల్పడ్డారని చెప్పేందుకు గట్టి ఆధారాలు ఉన్నాయని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి చెప్పారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో జాదవ్‌పైన అభియోగాలపై విచారణ జరుగుతోందన్నారు. 2017 ఏప్రిల్‌లో పాకిస్తాన్ కోర్టు జాదవ్‌పై వచ్చిన అభియోగాలను విచారించి మరణశిక్షను ఖరారు చేసింది. కాగా ఈ కేసుపై అంతర్జాతీయ న్యాయ స్థానంలో భారత్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం కులభూషణ్ జాదవ్‌పై అభియోగాలకు సంబంధించి రుజువులను న్యాయస్థానానికి సమర్పించినట్లు ఆయన చెప్పారు. ఈ కేసులో పాకిస్తాన్ తప్పనిసరిగా గెలిచి తీరుతుందన్నారు. ఈ కేసులో పాకిస్తాన్ తిరుగులేని ఆధారాలను సంపాదించిందన్నారు. పంజాబ్‌లోని ముల్తాన్ పట్టణంలో మంత్రి ఖురేషీ గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ అంతర్జాతీయ స్థానంలో జాదవ్‌పై వచ్చిన అభియోగాలకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించామన్నారు. చర్చల ద్వారా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2016 మార్చి నెలలో బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కులభూషణ్ జాదవ్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. పాకిస్తాన్ చేసిన అన్ని ఆరోపణలను ఇప్పటికే భారత్ తిరస్కరించింది. జాదవ్‌ను ఇరాన్‌లో కిడ్నాప్ చేసి బెలూచిస్తాన్‌లో అరెస్టు చేసినట్లు పాక్ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని భారత్ పేర్కొంది. నేవీలో రిటైర్డయిన తర్వాత జాదవ్ వ్యాపారాలు చేస్తున్నారని, అందులో భాగంగా ఇరాన్‌కు వెళ్లారని భారత్ పేర్కొంది.