అంతర్జాతీయం

ఇవేం ఇమ్మిగ్రేషన్ విధానాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 24: ఇమ్మిగ్రేషన్ పాలసీ, హెచ్1బీ వీసాలపై తలాతోక లేకుండా అనుసరిస్తున్న విధానాల వల్ల అమెరికా ఆర్థిక రంగంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని అమెరికా కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై ఇష్టం వచ్చిన రీతిలో ప్రకటనలు చేయడం వల్ల అమెరికాకు చెందిన ఐటి కంపెనీల విధానాలు అస్థిరత్వానికి లోనవుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ పాలసీపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ ప్రముఖ ఐటీ కంపెనీల సీఈవోలు హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ నెల్సన్‌కు లేఖ రాశారు. యాపిల్స్ సీఈవో టిమ్ కుక్, పెప్సికో సీఈవో ఇంద్రనూరుూ, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగ, సిస్కో సిస్టమ్స్ చైర్మన్ చుక్ రాబిన్స్‌తో పాటు మరికొంత మంది ఐటి దిగ్గజాలు లేఖ రాశారు. ఇమ్మిగ్రేషన్ విధానంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొని ఉందన్నారు. అమెరికా పోటీతత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఆర్థిక రంగంలో ఒడిదుడుకులు చోటుచేసుకుంటాయని వారు హెచ్చరించారు. ఇమ్మిగ్రేషన్, వీసాల మంజూరులో స్పష్టత లోపించడమే కాకుండా ఎప్పటికప్పుడు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. తమ ఉద్యోగులకు వీసా కల్పించే విషయమై ఏమి చేయాలో కంపెనీలకు పాలుపోవడం లేదన్నారు. ఎక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగులు, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములకు ఇచ్చే వీసా పర్మిట్లలో గందరగోళమైన ప్రకటనలు వెలువడుతున్నాయన్నారు. వీటిల్లో ఇష్టం వచ్చినట్లు మార్పులు చేస్తున్నారన్నారు. ఐటి కంపెనీలు ప్రతి ఏడాది అమెరికా, చైనా నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇక్కడికి వీసాపై తెస్తుంటాయి. ఈ రెండు దేశాలకు చెందిన సైన్స్, మ్యాథ్స్, ఇంజనీరింగ్ నిపుణులకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. వీసాలపై అయోమయంతో కూడిన నిర్ణయాల వల్ల కుటుంబాలు కూడా ఒకే చోట ఉండే పరిస్థితి కనపడడం లేదన్నారు. కాగా కొన్ని ఉద్యోగాలకు అమెరికాలో సరైన అర్హత ఉన్న వారు లేరని అమెరికా కార్మిక శాఖ పదే పదే చెబుతున్న విషయాన్ని ఐటి కంపెనీలు ప్రస్తావిస్తున్నాయి. అమెరికాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడి ఐటికంపెనీలు దగాకోరు విధానాలను అవలంభిస్తున్నాయని దేశాధ్యక్షుడు ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. దేశంలో చట్టబద్ధంగా పనిచేస్తున్న నిపుణులైన లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారని, వీరిని అస్థిరపరిచే విధంగా ఇమ్మిగ్రేషన్ పాలసీలను సమీక్షించరాదని ఐటికంపెనీలు లేఖలో పేర్కొన్నాయి. ఇదే విధానాలు కొనసాగితే పోటీతత్వం తగ్గుతుందని, ఆర్థికాభివృద్ధిపై దీని ప్రభావం పడుతుందన్నారు. దేశంలో చాలా ఉద్యోగాలకు తగిన విద్యార్హతలు ఉన్న వారు లభించకపోవడం వల్ల ఖాళీలుపెరుగుతున్నాయి. హెచ్-1బీ వీసాలను గతంలో మాదిరిగా మంజూరులో సరళ విధానాలను అవలంభించాలని ఐటి కంపెనీలు కోరుతున్నాయి.