అంతర్జాతీయం

పాక్‌లో పొదుపు చర్యలకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 25: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేసే దిశగా పాకిస్తాన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. నీతివంతమైన పాలన, ప్రభుత్వం నిధుల దుబారాను తగ్గించడం వంటి హామీలు ఎన్నిక సమయంలో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ హామీ ఇచ్చింది. హామీలు అమలుచేసి ప్రజలను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీన్లో భాగంగా ఉన్నతాధికారుల విమాన ప్రయాణాలపై కొత్త కేబినెట్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులు, సీఎంలు, ఉన్నతాధికారులు ఎవరూ ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణించడానికి వీల్లేదు. దీనికి సంబంధించి కేబినెట్ నిషేధం విధించింది. దేశంలోని అన్ని హెచ్‌ఓడీలకు ఇది వర్తిస్తుందని, ఇక మీదట అందరూ బిజినెస్/ క్లబ్ క్లాసులోనే వెళ్లాలని డాన్ పత్రిక వెల్లడించింది. కొత్త ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షన జరిగిన రెండో సమావేశంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను డాన్ ప్రచురించింది. దేశాధ్యక్షుడు, ప్రధాని, చీఫ్ జస్టిస్, సెనేట్ చైర్మన్, నేషనల్ అసెంబ్లీ స్పీకర్, ముఖ్యమంత్రులు ఎవరూ అంతర్జాతీయ విమానాల్లో మొదటి తరగతిలో ప్రయాణించడానికి వీల్లేదు. బిజినెస్/క్లబ్ క్లాసుల్లో ప్రయాణం చేయవచ్చు. విమాన చార్జీలపై ప్రభుత్వం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోడానికి ఓ కారణం ఉంది. పాకిస్తాన్ నుంచి నడిపే విదేశీ విమానాల ఫస్ట్‌క్లాస్ చార్జీలు బిజినెస్/క్లబ్ తరగతుల చార్జీలకంటే మూడొందల రెట్టు అధికం. కొత్త ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా విదేశీ ప్రయాణాలకు బిజినెస్ క్లాసులోనే వెళ్తానని ప్రకటించారు. అలాగే ప్రత్యేక విమానాల్లో వెళ్లకూడదని పీఎం నిర్ణయించుకున్నట్టు తెలిసింది.ప్రత్యేక విమానాన్ని దేశంలోనే ఉపయోగించుకోవాలని ఖాన్ నిర్ణయించారు. విమాన ప్రయాణాలపై నిషేధం విధించడమే కాదు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల పనిదినాలు ఇక నుంచి ఆరురోజులు ఉంటాయి. ప్రస్తుతం ఐదు రోజుల పని దినాలే అమలవుతున్నాయి. అయితే పనిగంటల పెంపుపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వాన్ని గట్టెకించడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారం సందర్భంగా పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ హామీ ఇచ్చింది.