అంతర్జాతీయం

చర్చలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 25: భారత్‌తో కాశ్మీర్ సహా అన్నిసమస్యలను పరిష్కరించుకోవాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని కొత్త విదేశాంగ శాఖ మంత్రి షా మెహమూద్ ఖురేషీ అన్నారు. ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందన్నారు. కొత్త ఢిల్లీతో సుహ్రృద్భావ వాతావరణంలో చర్చలు జరిపేందుకు తమప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చర్చలు జరిపేందుకు భేషిజాలు తమకు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు ఆయన ఇక్కడ మాట్లాడుతూ చర్చలకు రెండు వైపులా సుముఖత ఉండాలని, అప్పుడే ఫలితాలు ఉంటాయన్నారు. ఒక చేత్తో చెప్పట్లు కొట్టలేమన్నారు. ‘ మా ప్రభుత్వం హృదయం విప్పి మాట్లాడుతోంది. అన్ని అంశాలపై మంచి వాతావరణంలో చర్చించాలి. మా ప్రభుత్వ లక్ష్యంలో ఎటువంటి దాపరికాలు లేవు’ అన్నారు. ఇటీవల కాలంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. భారత్‌లో ఉగ్రవాదులదాడుల వెనక పాకిస్తాన్ పాత్ర ఉందని రుజువు కావడంతో ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఖురేషీ మాట్లాడుతూ, కాశ్మీర్‌తో సహా అన్ని అంశాలకు చర్చలే పరిష్కారమన్నారు. కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను వివరించారని చెప్పారు. చర్చల విషయమై భారత్ ఒక అడుగు ముందుకేస్తే, పాకిస్తాన్ రెండడుగులు వేస్తుందన్నారు. గుఢచారి కులభూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ అంతర్జాతీయ కోర్టులో గెలుస్తుందన్నారు. జాదవ్ గూఢాచర్యానికి పాల్పడ్డారని చెప్పేందుకు రుజువులు ఉన్నాయని చెప్పారు. తమ దేశానికి సంబంధించి తమ వద్ద ఉన్న రుజువులన్నీ అంతర్జాతీయ న్యాయస్థానానికి సమర్పించామన్నారు. రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి ముఖాముఖి చర్చల కంటే మించి మరో మార్గమేమీ లేదని ఆయన చెప్పారు. చర్చలను మళ్లీ ప్రారంభించాలన్నారు. ఇరుదేశాల మధ్య చర్చల్లో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని తానేమీ భావించడమేమీ లేదన్నారు. ఒక మంచి వాతావరణాన్ని మాత్రం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.