అంతర్జాతీయం

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జర్దారీకి ఎఫ్‌ఐఏ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి ఫెడరల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) సమన్లు జారీ చేసింది. సుమారు 35 మిలియన్ రూపాయల మనీల్యాండరింగ్ వ్యవహారంతోబాటు నకిలీ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన కేసులో ఆయనతోబాటు ఆయన సోదరి ఫర్యాల్ తల్పూర్ సైతం ఎప్‌ఐఎ విచారణను ఎదుర్కోనున్నారు. గత జూలైలో పాక్ సుప్రీం కోర్టు మనీల్యాండరింగ్ కేసులో జర్దారీని, ఆయన సోదరిని లబ్ధిదారుల జాబితాలో చేరుస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కో చైర్మన్‌కు సహాయకుడిగా వ్యవహరిస్తున్న ప్రఖ్యాత బ్యాంకర్ హుస్సేన్ లవాయ్‌ను అరెస్టు చేయడం జరిగింది. కాగా ఇస్లామాబాద్‌లోని తమ కేంద్ర కార్యాలయానికి వచారణ నిమిత్తం సోమవారం హాజరుకావాలంటూ ఆసిఫ్ అలీ జర్దారీ, ఆయన సోదరి ఫర్యాల్ తల్పూర్‌కు శనివారం ఎఫ్‌ఐఎ నోటీసులు జారీ చేసింది. ఇలా జర్దారీకి ఎఫ్‌ఐఎ నోటీసులు జారీ చేయడం నాల్గలసారని డాన్ అనే పత్రిక వెల్లడించింది. ఇదివరకు సమన్లు జారీ చేసినా మల్టీ మనీ ల్యాండరింగ్ కేసును విచారిస్తున్న ఎఫ్‌ఐఏ సంయుక్త విచారణ బృందం ముందు ఈ అన్నాచెల్లెళ్లు హాజరుకాలేదు. దీంతో ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదికను అందజేయాలని సుప్రీం కోర్టు ఎప్‌ఐఎను గత మంగళవారం ఆదేశించింది. ఐతే తమకు విచారణ జరిపే ఏజెన్సీపై విశ్వాసం లేదంటూ జర్దారీ, ఆయన సోదరి విచారణకు హాజరుకాలేదు. ఈక్రమంలో కరాచీలోని స్థానిక బ్యాంకింగ్ కోర్టు ఈనెల 17న జర్దారీతోబాటు ఈ కేసులో పరారీలో ఉన్న పలువురు వ్యక్తులపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. సెప్టెంబర్ 4లోగా నిందితులను అరెస్టు చేయాల్సిందిగా ఆ న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో తనకు రక్షణతో కూడిన బెయిల్ కావాలన్న జర్దారీ అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది. మనీల్యాండరింగ్ కేసులో మొత్తం 29 నకిలీ ఖాతాలకు సంబంధించి 32మందిని ఎఫ్‌ఐఎ విచారిస్తోంది. జర్దారీ సన్నిహిత సహాయకుడు లవాయ్ గత నెలలో అరెస్టు అయ్యారు. సమ్మిట్, సింద్, యునైటెడ్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచేందుకు లవాయ్ సహకరించారన్నది అభియోగం. ఇలా ఇదివరకు 29 ఖాతాలు గుర్తించగా మరో 15 ఖాతాలు కూడా అనుమాస్పదంగా ఉన్నాయని అధికారులు తెలియజేశారు.