అంతర్జాతీయం

భవిష్యత్ కోసం పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నికోసియా, సెప్టెంబర్ 4: తక్షణ ఫలితాలను ఆశించి పనిచేయవద్దని, భవిష్యత్‌ను దృష్టిలోపెట్టుకుని ముందుకెళ్లాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ యువతకు పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపుచేసుకుని యువత మరింత కష్టపడి పనిచేయాలని మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు. ఐరోపా దేశాల్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన రాష్టప్రతి ముందుగా సెప్రస్ వచ్చారు. సెప్రస్ యూనివర్శిటీలో ‘యువత, సాంకేతికత, ఆలోచనలు- 21వ శతాబ్దం’ అన్న అంశంపై కోవింద్ ఉపన్యసించారు. తొలుత నోబెల్ అవార్డు గ్రహీత విగ్రహానికి ఆయన పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించారు.‘ఇప్పటికిప్పుడు ఫలితాలను ఆశించి పనిచేయవద్దు. కష్టపడితే ఫలితం మీకే దక్కుతుంది. భవిష్యత్ అంతా మీదే’అని రాష్టప్రతి ఉద్ఘాటించారు.‘మొదటి సారి సెప్రస్ వచ్చిన నాపై ప్రజలు చూపిన ఆదరణ మరువలేను. భారత్-సెప్రస్ మధ్య మైత్రికి ఓ ప్రత్యేకత ఉంది’అని కోవింద్ స్పష్టం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు రెండు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సాంకేతికత అభివృద్ధికి దోహదపడాలని, దీని కోసం ఇరుదేశాలు కృషి చేయాలని అన్నారు. ఆధునిక బోధనాపద్ధతులపై రాష్టప్రతి మాట్లాడుతూ ‘డిజిటల్ క్లాస్ రూంలు మరింత దగ్గరయ్యాయి. విద్యార్థి ఎక్కడ నుంచైనా పాఠాలు నేర్చుకునే సాంకేతిక సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది’ అని పేర్కొన్నారు. ఈ-బుక్స్, ఎడ్యుకేషన్ యాప్‌ల ప్రవేశం విప్లవాత్మకమైన మార్పులుగా కోవింద్ అభివర్ణించారు. దేశాల బహుముఖ అభివృద్ధికి సైన్స్ దోహదపడుతోందన్న భారత రాష్టప్రతి ‘సంప్రదాయ ఉద్యోగాలకు అంతరాయం ఏర్పడిన విషయం వాస్తవమే. అయితే ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్, లైఫ్ సైన్స్, ఎనర్జీ వంటి రంగాల్లో నూతన అవకాశాలు సృష్టించుకోవాలి’ అన్నారు. ప్రపంచంలోనే శాస్త్ర,సాంకేతికంగా భారత్ మూడో అతిపెద్ద దేశమని స్పష్టం చేశారు.