అంతర్జాతీయం

భారత విద్యార్థుల కోసం పోస్ట్ స్టడీ వీసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 4: ఇంగ్లాండ్‌లో ఉన్నత విద్యను అభ్యసించదలిచే భారతీయ విద్యార్థుల కోసం కొత్తగా పోస్ట్ స్టడీ వీసా విధానాన్ని అమలు చేయాలని ఆ దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు మంగళవారం ఇక్కడ ప్రతిపాదించారు.ప్రతియేటా భారత్ లాంటి దేశాల నుంచి ఈ దేశానికి వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న తరుణంలో విదేశీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను కొత్త వీసా విధానాన్ని అమలు చేయాలని అక్కడి విశ్వవిద్యాలయాల ప్రతినిధి బృందం సూచించింది. గతంలో పోస్ట్ స్టడీ వర్క్ వీసా విధానం ఈ దేశంలో అములు ఉండేవి. అయితే 2012లో ఆ విధానాన్ని ఇంగ్లండ్ రద్దుచేసింది. పాత విధానం మేరకు ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి విద్యాభ్యాసం చేసే వారు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఇక్కడే రెండేళ్ల వరకు పనిచేయాల్సివుంటుంది. కాగా ఇంగ్లాండ్‌లోప్రోత్సాహకరమైన విధానాలు లేకపోవడం వల్లే భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి అనువైన గమ్యస్థానాలుగా ఇతర దేశాలను ఎంచుకుంటున్నారని యూకే విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ విధాన విభాగం చైర్మన్ ప్రొఫెసర్ స్టీవ్‌స్మిత్ తెలిపారు. ఆయన ఎగ్జెటర్ విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్ కూడా. ఇతర దేశాల విద్యార్థులను ప్రోత్సహించే ఏదైనా సందేశాన్ని ఇవ్వలేకపోతే అంతర్జాతీయ విద్యావ్యవస్థ కలిగిన దేశాల్లో బ్రిటన్ వెనుకబడిపోయే ప్రమాదం ఉందని స్మిత్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు విజయపథం అన్న నినాదంతో ముందుకెళ్లడం ద్వారా దేశంలో విద్యావ్యాపారాన్ని సైతం విస్తరించవచ్చని తాము ప్రతిపాదించదలిచామన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన జారీచేసే గ్లోబల్ గ్రాడ్యుయేట్ ట్యాలెంట్ వీసా ద్వారా ఇక్కడికి వచ్చే విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ఇక్కడే అర్హత గల సాంకేతిక పరమైన ఉద్యోగాల్లో రెండేళ్లపాటు పనిచేయవచ్చని, ఈ అంశాన్ని షఫీల్డ్‌లో ఈ వారం జరిగిన విశ్వవిద్యాలయాల చీఫ్‌లు హాజరైన వార్షిక సదస్సులో చర్చకు వచ్చిందని స్మిత్ చెప్పారు. ప్రస్తుతం అమెరికా, కెనడా దేశాలు మూడేళ్ల పోస్ట్‌స్టడీ ఆఫర్లు ఇస్తున్నాయని, అలాగే ఆస్ట్రేలియా నాలుగేళ్లు, న్యూజిల్యాండ్ మూడేళ్లు వంతున ఈ ఆఫర్లు అములు చేస్తున్నాయని, ఈమేరకు ఇటీవలే ఇమిగ్రేషన్ విధానాన్ని సైతం ఆదేశాలు సవరించాయని స్మిత్ తెలిపారు. ఇలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడం వల్ల భారత్ నుంచి ఇంగ్లాండ్ వచ్చే విద్యార్థుల సంఖ్య 210-11లో ఇరవై నాలుగు వేలుండగా 2015 నాటికి తొమ్మిది వేలకు పడిపోయిందనిన్నారు. లండన్ మేయర్ సాధిక్ ఖాన్ సైతం ఈ అంశంపై స్పందించి అంతర్జాతీయ విద్యార్థులకు మంచి ప్రోత్సాహకాలను ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారన్నారు. ప్రతిభగల విద్యార్థులకు, గ్రాడ్యుయేట్లకు అన్ని ప్రపంచ దేశాల్లోకెల్లా ఆకర్షణీయమైన ప్రోత్సాహక విధానాన్ని బ్రిటన్ తరపున రూపొందించి ఇచ్చేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని 136 దేశాల సభ్యత్వం ఉన్న యూకే ఇంటర్నేషనల్ యూనివర్శిటీస్ డైరెక్టర్ వివియన్ స్టెర్న్ తెలిపారు. కొత్త వీసా ప్రతిపాదనల మేరకు ఇక్కడి అన్ని ఉన్నత విద్యా సంస్థలు నలుగురు స్పాన్సర్లను విదేశీ విద్యార్థుల కోసం అనుసంధానంగా రిజిస్టర్ చేసుకుని విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడంతోబాటు, ఉద్యోగ అనుభవాన్ని సంతరించుకునేందుకు దోహదం చేయాల్సివుంటుందన్నారు. మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీకి త్వరలో తమ ప్రతిపాదనలను పంపుతామని స్టెర్న్ చెప్పారు.