అంతర్జాతీయం

మండే సూర్యుడి రహస్యాల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 5: మండే సూర్యుడి దృశ్యాలను, పరిస్థితిని అధ్యయనం చేసేందుకు నాసా త్వరలో సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించనుంది. భూమి వాతావరణం నుంచి ఈ రాకెట్ సూర్య మండలంలో మార్పులను అధ్యయనం చేస్తుంది. ఎక్స్‌రే ద్వారా సూర్య మండల దృశ్యాలను బంధిస్తుంది. ఈ రాకెట్‌కు ఫోకసింగ్ ఆప్టిక్స్ ఎక్స్ రే సోలార్ ఇమేజర్ మిషన్ అని నామకరణం చేశారు. ఈ నెల 7వ తేదీన న్యూ మెక్సికో నుంచి ఫోక్స్‌సీని ప్రయోగిస్తారు. పెద్ద శాటిలైట్ ప్రయోగాలను చేసే బదులు త్వరితగతిన నిర్దేశించిన పనిని పూర్తి చేసే చిన్న శాటిలైట్‌లను ప్రయోగించడం మేలనే నిర్ణయంతో వీటిని రూపొందించినట్లు నాసా శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. వీటి నిర్మాణానికి వ్యయం కూడా తక్కువ. భూమి వాతావరణాన్ని దాటి పైకి వెళ్లి అక్కడి నుంచి సూర్యమండలంలో అంతు తెలియని రహస్యాలను ఎక్స్‌రే ద్వారా కనుగొనేందుకు ఈ మిషన్‌ను ప్రయోగించనున్నారు. ఎక్కువ శక్తి కలిగిన ఎక్స్‌రే కిరణాలను ప్రయోగించి సూర్యమండలంలో అంతర్లీనమార్పులను అధ్యయనం చేస్తారు. పదివేల డిగ్రీల ఫారన్ హీట్ వరకు ఉండే సూర్యుడిని మాత్రమే మానవులు చూడగలరు. మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్‌తో మండుతున్న సూర్యుడి లోపల చోటుచేసుకుంటున్న మార్పులను తెలుసుకునేందుకు ఎక్స్‌రే సోలార్ ఇమేజి ఉపయుక్తంగా ఉంటుందని అంచనా వేసినట్లు నాసా శాస్తవ్రేత్తలు చెప్పారు. గతంలో ఈ తరహా ఫాక్స్ సీ మిషన్‌ను 2012, రెండవ మిషన్‌ను 2014లో ప్రయోగించారు. కొత్త టెలిస్కోప్ ఇమేజింగ్ లోయర్ ఎనర్జీ వ్యవస్థను అ మర్చినట్లు సైంటిస్టులు చెప్పారు.