అంతర్జాతీయం

జపాన్‌లో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, సెప్టెంబర్ 6: భూకంపం, కొండచరియలు విరిగిపడిన సంఘటనల్లో జపాన్ దేశంలో తొమ్మిది మంది మృతి చెందారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6గా నమోదైంది. దేశంలోని ఉత్తర ప్రాంతంలో గురువారం సంభవించిన భూకంపం వల్ల తొమ్మిది మంది చనిపోగా, చాలామంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఈ వారంలో పెద్దతుపాను దేశాన్ని తాకడంతో అనేక ఇళ్లు నేలమట్టమైన సంగతి తెలిసిందే. దాని నుంచి పూర్తిగా తేరుకోకముందే భూకంపం విరుచుకుపడింది. భూకంపం భయంతో విద్యుత్ సరఫరా చేసే టోమారి న్యూక్లియర్ ప్లాంట్‌ను ముందు జాగ్రత్తచర్యగా మూసివేయడంతో 30 లక్షలకు పైగా గృహాలు అంధకారంలో మునిగాయి.