అంతర్జాతీయం

భారత్, చైనాలకు సబ్సిడీలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో: సబ్సిడీలపై వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానాన్ని నిలిపివేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఈ సబ్సిడీలపై వస్తువులను భారత్, చైనా లాంటి దేశాలకు పంపుతున్నామన్నారు. ఈ దేశాలేమో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, అమెరికా మాత్రం ఆర్థికంగా నష్టపోతోందన్నారు. అమెరికా కూడా ఒక అభివృద్ధి చెందుతున్న దేశమన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ తీరు వల్లనే చైనా ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా అవతరించిందని ఆయన చెప్పారు. ఉత్తర డకోటాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్, చైనా తాము అభివృద్ధి చెందుతున్న దేశాలని చెప్పుకుంటున్నాయని, కాని సబ్సిడీలపై అమెరికా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాయన్నారు. ఈ సబ్సిడీల ఖర్చును అమెరికా భరిస్తుందని, ఇదేమి పద్ధతి, విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ విషయమై ఉదాసీన వైఖరి పనికిరాదని, భారత్, చైనాలకు పంపే వస్తువులపై సబ్సిడీ ఉంటే, ఇక వాటిని ఎత్తివేయాలన్నారు. అమెరికా కూడా ప్రపంచంలో ఇతర దేశాల కంటే శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదన్నారు. చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ అంటే తనకు అభిమానమన్నారు. సబ్సిడీలతో కలిపి చైనా మన వద్ద నుంచి సాలీనా 500 బిలియన్ డాలర్లను తీసుకుంటోందన్నారు. ఏళ్లతరబడి ఈ దేశాలను పరిరక్షిస్తున్నామన్నారు. మన సబ్సిడీలతో వారు సొమ్ము చేసుకుని అనుభవిస్తున్నారన్నారు. ప్రపంచంలో అతి పెద్ద మిలిటరీ వ్యయం అమెరికాదేనన్నారు. ఈ వ్యయమంతా ఇతర దేశాలను రక్షించడానికి వినియోగిస్తున్నామన్నారు. ఆర్థికంగా బాగుపడుతున్న దేశాలకు సబ్సిడీలపై వస్తువులు పంపడం సరికాదన్నారు.