అంతర్జాతీయం

లడ్డూలు కావాలా నాయనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, సెప్టెంబర్ 9: అమెరికాలోని చికాగోలో జరుగుతున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్ (డబ్ల్యుహెచ్‌సి) సమావేశానికి హాజరైన హిందూ ప్రతినిధులకు వింత అనుభవం ఎదురైంది. లడ్డూలు కావాలా? అయితే మేమిచ్చే ‘ఐకమత్యం’ సందేశాన్ని వినండి అంటూ సమావేశ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలుకుతూ ఒక స్వీట్ బాక్స్‌ను అందజేశారు. వాటిలో రెండు లడ్డూలు ఉండగా, అందులో ఒకటి మెత్తగా, రెండోది గట్టిగా ఉంది. దీనిపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన ప్రతినిధులకు సమావేశ కో-ఆర్డినేటర్ గుణమగేశన్ వివరణ ఇచ్చారు. హిందూ సమాజం ప్రస్తుతం ఐకమత్యంగా లేదని చెప్పడానికి గుర్తుగా రెండు రకాల లడ్డూలు అందజేశామని చెప్పారు. స్వీట్ బాక్స్‌లో ఉన్న మెత్తటి లడ్డూ ప్రస్తుతం సమాజంలో ఉన్న హిందువుల పరిస్థితిని తెలియజేస్తోంది. మెత్తగా ఉన్న ఆ సమాజాన్ని ఎవరైనా సులభంగా పగులగొట్టవచ్చు, విడదీయవచ్చు. అలాగే గట్టిగా ఉన్న లడ్డూ భవిష్యత్‌లో హిందువులు ఎలా వుండాలో తెలియజేస్తోంది. ఆ లడ్డూలాగే హిందువులు కూడా ఇకముందు పటిష్టంగా, ఎలాంటి వత్తిళ్లకు లొంగకుండా దృఢంగా ఉండాలని తెలియజేస్తోందని గుణమగేశన్ చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్వామి భారత్ సేవా శ్రమానికి చెందిన పూర్ణాత్మానంద మాట్లాడుతూ పునరుజ్జీవనం కోసం హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. హిందూమత ప్రవచనాలు మానవత్వంతో కూడుకుని ఉంటాయని వాటిని భారత్‌లోని స్కూళ్లు, కాలేజీలలో బోధించాలని సూచించారు. చిన్మయ మిషన్ అధినేత మాట్లాడుతూ మనకు ప్రతీది ఇంటినుంచే ప్రారంభమవుతుందని, మన సంస్కృతి, సంప్రదాయాలు కూడా ఇంటి నుంచే మొదలవుతాయని, ఇంట్లో వాటిని పాటించకపోతే సంస్కృతి కూడా విచ్ఛిన్నం అవుతుందని, పిల్లలు వాటికి దూరమవుతారని అన్నారు. తర్వాత జీవితంలో అశాంతి మొదలవుతుందని చెప్పారు. దీనిని నివారించడానికి ప్రతి హిందువును హిందుత్వం వైపు నడిపించాలని సూచించారు. హిందువులు ఐక్యంగా ఉండాలంటే అందరూ ఒకలా ఉండమని అర్థం కాదని, మనందరికీ ఒకటే లక్ష్యం ఉండటం, విద్యలో సంస్కరణలు చేపట్టడం, హిందూ సంస్కృతి, మతం గొప్పదం తెలియజేయడమని, మన రుషులు ఇదివరకే గురుకులాల్లో ఇలాంటి విధానాన్ని అనుసరించారని ఆయన చెప్పారు.

హిందూ ధర్మ ఆచార్య సభ సెక్రటరీ జనరల్ స్వామి పరమానంద మాట్లాడుతూ ప్రతి హిందువూ తన సొంత లాభం కోసం ఆలోచించకుండా సమాజ దృష్టితో ఆలోచించాలని అన్నారు. ప్రస్తుతం సమాజంలో మానవుల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సద్గురు దిలీప్‌సింగ్ మాట్లాడుతూ సమాజంలో హిందువులు, సిక్కులు ఎంతమాత్రం వేర్వేరు కాదని అన్నారు. హిందువులు ఇంగ్లీష్ భాష వాడకాన్ని తగ్గించి తమ మాతృభాషలో మాట్లాడాలని సూచించారు. స్వామి వివేకానంద చికాగోలో చేసిన చారిత్రాక ప్రసంగాన్ని పురస్కరించుకుని ప్రపంచ హిందూ కాంగ్రెస్ నిర్వహించిన ఈ సమావేశానికి భారత్‌నుంచి పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.