అంతర్జాతీయం

మోదీ ఆధ్వర్యంలో దూసుకుపోతున్న భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, సెప్టెంబర్ 9: ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. గొప్ప సంస్కృతికి, సంప్రదాయాలకు నిలయం భారత్ అన్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రపంచమంతా ఆర్థిక రంగంలో నిస్తేజం చోటు చేసుకుంటే, భారత్‌లో మాత్రం అభివృద్ధి వెలిగిపోతోందన్నారు. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచ ఆర్థిక ఏజన్సీలు కితాబునిస్తున్నాయన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తదితర సంస్థలు భారత్ సాధించిన అభివృద్ధిని ప్రశంసించాయన్నారు. ఈ సభలో ఆయన తెలుగులో మాట్లాడుతూ , తాను ఉప రాష్టప్రతి అయిన తర్వాత 40 మంది వరకు వివిధ దేశాల రాయబారులను కలిశానన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ ఆసక్తిని కనపరుస్తున్నారన్నారు. భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలపై ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం లభించిందన్నారు. ఆయన ఇక్కడ ప్రపంచ హిందూ కాంగ్రెస్ సదస్సులో కూడా పాల్గొంటారు. తనకు తెలుగు వారితో అమెరికాలో మాట్లాడడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని తెలుగు సంఘాలు నిర్వహించాయి.